సెల్ ఫోన్స్ పగిలిపోతాయంటూ పుష్ప టీమ్ స్ట్రాంగ్ వార్నింగ్.. కారణం?

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్నటువంటి “పుష్ప” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కడంతో ఇందులో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నారు.

 Pushpa Movie Team Angry On Leak Issues, Pushpa Movie, Allu Arjun, Pushpa Movie T-TeluguStop.com

ఇక ఇందులో అల్లు అర్జున్ సరసన కథానాయికగా రష్మిక ఓ గిరిజన యువతి పాత్రలో కనిపించనున్నారు.ప్రస్తుతం షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నో సన్నివేశాలను లీకు రాయుళ్లు లీక్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

అయితే ఈ లీకుల విషయంపై చిత్రబృందం ఎన్నోసార్లు స్పందించి గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పటికీ ఈ లీకుల పర్వం మాత్రం ఆగడంలేదు.ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ సినిమా అవుట్ డోర్ షూటింగ్స్ లో ఉండటం వల్ల ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కి చేరుకోవడంతో అభిమానులను కంట్రోల్ చేయడం చిత్ర బృందానికి పెద్ద సవాల్ గా మారిపోయింది.

ఈ క్రమంలోనే షూటింగ్ లోకేషన్ కు వచ్చిన చాలామంది అభిమానులు సెల్ ఫోన్ ల ద్వారా అక్కడ జరిగేటువంటి సన్నివేశాలను చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.తాజాగా ఈ సినిమాలో బన్నీ నడుపుతున్నటువంటి లారీకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో ఉందంటూ ఆ లారీ ఫోటోను అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు.ఇలా సినిమాకు సంబంధించిన చాలా విషయాలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టడంతో వీటన్నింటిని ఆపడానికి చిత్రబృందం సరికొత్త ఆలోచనను చేశారు.

ఈ క్రమంలోనే షూటింగ్ లొకేషన్ లో ఎవరైనా సెల్ ఫోన్ లో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తే సెల్ ఫోన్స్ పగిలిపోతాయంటూ.బోర్డులు పెట్టారు.అయితే చిత్రబృందం ఈ విధంగా బోర్డులు పెట్టినప్పటికీ అభిమానులు మాత్రం వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube