మరొక మైల్ స్టోన్ చేరుకున్న పుష్పరాజ్ ఇంట్రో !

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సినిమా సినిమాకు అంచనాలు పెంచుకుంటూ పోతాడు అల్లు అర్జున్.

 Pushpa Raj Intro Video Cross 75 Millions, Pushpa Movie, Pushpa Raj Intro Video,-TeluguStop.com

అల్లు వారసుడికి టాలీవుడ్ తో పాటు మిగతా భాషల్లో కూడా అభిమానులు ఉన్నారు.ఆయన డాన్స్ అంటే అభిమానులు పడి చచ్చిపోతారు.

అల్లు అర్జున్ సినిమాలు యుట్యూబ్ లో మిలియన్ వ్యూస్ రాబడుతాయి.

తాజాగా అల్లు అర్జున్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమాపుష్పనుండి వచ్చిన టీజర్ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

పుష్ప పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మరిన్ని అంచనాలు పెంచుకున్నారు.ఈ మధ్యే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ భారీ రికార్డ్స్ క్రియేట్ చేస్తూ యూట్యూబ్ లో దూసుకుపోతుంది.

తెలుగులో మొదటిసారిగా 70 మిలియన్ వ్యూస్ దాటిన సినిమాగా భారీ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఇంకా దూసుకు పోతుంది.

Telugu Allu Arjun, Pushpa, Pushparaj, Sukumar-Movie

అయితే ఇప్పుడు ఈ వీడియో మరొక మైల్ స్టోన్ క్రియేట్ చేసింది.అల్లు అర్జున్ పుష్పరాజ్ వీడియో ఏకంగా 75 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి మరొక రికార్డ్ క్రియేట్ చేసింది.ఇప్పటికే ఈ వీడియో అదే స్పీడ్ తో దూసుకు పోతుంది.

ఇప్పట్లో ఈ స్పీడ్ ఆగేలా కూడా లేదు.ఇది ఇలా ఉంటె ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.

Telugu Allu Arjun, Pushpa, Pushparaj, Sukumar-Movie

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా పుష్పరాజ్ పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాలో రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.ఈ సినిమాను 250 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube