హాట్ గా తయారయ్యవ్ అంటూ ప్రియమణిపై పుష్ప రాజ్ క్రేజీ కామెంట్!

ప్రస్తుత కాలంలో బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలకు వెండితెర స్టార్స్ హాజరవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొన్ని కార్యక్రమాలు గ్రాండ్ ఫినాలేలకు స్టార్ సెలబ్రెటీలు హాజరవుతూ ఎంతో సందడి చేస్తున్నారు.

 Pushpa Raj Crazy Comment On Priyamani, Allu Arjun, Tollywood, Hero, Comment, Pri-TeluguStop.com

ఈ విధంగా ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షో ఢీ 13 గురించి అందరికీ తెలిసిందే.అయితే ఈ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకు చేరుకోనుంది.

ఈ క్రమంలోనే గ్రాండ్ ఫినాలేకి సంబంధించిన ప్రోమో నిర్వాహకులు విడుదల చేయడంతో ఈ ప్రోమో వైరల్ గా మారింది.ఇక ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ పాల్గొన్నారు.

ఇలా వేదికపై కొంతమంది డాన్సర్స్ ఏయ్ బిడ్డా.ఇది నా అడ్డ అంటూ డాన్స్ చేస్తుండగా ఆ సమయంలో పుష్పరాజ్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

ఇక అల్లు అర్జున్ కూడా వారితో కలిసి స్టెప్పులు వేశారు.అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ… అల్లు అర్జున్ కు స్వాగతం పలికి అక్కడే ఉన్నటువంటి పూర్ణ ప్రియమణి గురించి తెలిపారు.

వీరిలో ప్రియమణి ని ఉద్దేశిస్తూ ఎవరైనా డాన్స్ బాగా చేస్తే ఈమె హగ్ చేసుకుంటారు.ఇక పూర్ణను చూపిస్తూ ఈమె అయితే ఏకంగా బుగ్గ కొరకడం చేస్తారని చెప్పడంతో వెంటనే అల్లుఅర్జున్ ఇంకా బాగా చేస్తే ఏమిస్తారు అని పూర్ణని ఉద్దేశించి అన్నారు.

ఇక ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉన్న సమయంలోనే హైపర్ ఆది సుడిగాలి సుధీర్ పంచ్ డైలాగులను అల్లుఅర్జున్ ఎంతో ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.అలాగే మధ్య మధ్యలో అల్లు అర్జున్ కూడా పంచ్ డైలాగులు పేలుస్తూ అందరిని నవ్వించారు.

ఇలా పలు డాన్స్ పర్ఫార్మెన్స్ లు అయిపోయిన తర్వాత ప్రియమణి అల్లుఅర్జున్ తో మాట్లాడుతూ….నేను మీ సినిమాల్లో నటించలేకపోయానని ఎంతో బాధపడుతున్నాను అని అనగా వెంటనే అల్లు అర్జున్ ఇప్పటికీ ఛాన్స్ ఉంది అంటూ సమాధానం చెప్పారు.

Telugu Allu Arjun, Dhee, Priyamani, Tollywood-Movie

బాధపడాల్సిన పనిలేదు.ఇప్పుడు కూడా నాతో కలిసి నటించవచ్చు అసలే సన్నపడ్డావ్… చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ అల్లు అర్జున్ ప్రియమణి గురించి షాకింగ్ కామెంట్ చేయడంతో అక్కడ ఉన్న వారందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.ఈ క్రమంలోనే అల్లుఅర్జున్ ప్రియమణి గురించి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ప్రోమోలో భాగంగా ఈ డాన్స్ షో టైటిల్ ను కావ్య గెలుచుకున్నట్టు తెలుస్తోంది.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో పుష్ప అనే చిత్రంలో నటించారు.షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇందులో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో కనిపించనున్నారు.గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక శ్రీవల్లి పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు పాటలు సినిమా పై భారీ అంచనాలు పెంచాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube