బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో పుష్ప రాజ్ సందడి చేసిన విషయం తెలిసిందే.ఎన్.
బి.కే అన్ స్టాపబుల్ షోలో ఇది చాలా క్రేజీ ఎపిసోడ్ అనుకోగా డిసెంబర్ 25 క్రిస్ మస్ కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు.కాని కొన్ని అనివార్య కారణాల వల్ల బాలకృష్ణ బన్నీ ఎపిసోడ్ వాయిదా పడ్డదని అంటున్నారు ఆహా టీం.
దీనికి బదులుగా పుష్ప టీం క్రిస్ మస్ సెలబ్రేషన్స్ ప్రోగ్రాం ఒకటి ప్లాన్ చేస్తున్నారట.అన్ స్టాపబుల్ ప్లేస్ లో అది వస్తుందని అంటున్నారు. బాలకృష్ణ అఖండ ఈవెంట్ కు అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు.అప్పటినుండి అల్లు అర్జున్, బాలయ్య క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది.అన్ స్టాపబుల్ షోలో అల్లు అర్జున్ వస్తే ఆ సందడి వేరేలా ఉండేది.
అయితే లేట్ అయినా సరే లేటెస్ట్ గా ఆ ఎపిసోడ్ ఉంటుందని అంటున్నారు.క్రిస్ మస్ కు ఎలాగు రావట్లేదు కాబట్టి న్యూ ఇయర్ కు ఆ ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తారేమో చూడాలి.
దీని తర్వాత బాలకృష్ణ, రవితేజ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ కు రెడీగా ఉంది. ఆ ఎపిసోడ్ ను డిసెంబర్ 31న స్ట్రీమింగ్ చేస్తామని ఎనౌన్స్ చేశారు.