మరీ ఇంత ఓవరాక్షనా? పుష్ప కలెక్షన్స్ పోస్టర్ పై నెటిజన్ల సటైర్లు..

ఒక్కోసారి సినిమా వాళ్లు చేసే అతి మొదటికే మోసం తెస్తుంది.ఆయా సినిమాల పోస్టర్ల మీద తమ సినిమా ఇంత కలెక్షన్ చేసిందని రాస్తూ ఉంటారు.

 Pushpa Posters Hype In Bollywood , Pushpa, Bollywood, Ram Charan, Allu Arjun, Su-TeluguStop.com

అయితే ఒక్కోసారి దర్శకనిర్మాతల ఓవరాక్షన్ పట్ల జనాలు నవ్వుకుంటారు.అదే సమయంలో ఇదేం పిచ్చి ఆనందం అంటూ మండిపడతారు కూడా.

పది రూపాయలు వస్తే.పదకొండు రూపాయలు వచ్చాయని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కానీ.50 రూపాయలు వచ్చాయని చెప్తే.నవ్వులపాలయ్యే పరిస్థితి వస్తుంది.

ఇలాంటి పించి పనులు చేస్తే  చాలా మంది నిర్మాతలు, దర్శకుల ఇండ్ల మీద ఐటీ అధికారులు దాడులు చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి.అయితే అవన్నీ జస్ట్ హైప్ కోసం వేశామని వివరణ ఇచ్చుకున్న సందర్భాలున్నాయి.

ఇలాంటి పనలు మూలంగా ఇబ్బందులు వస్తాయనే కొంత మంది హీరోలు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. రాంచరణ్ లాంటి టాప్ యాక్టర్లు తమ పోస్టర్ల మీద కలెక్షన్లకు సంబంధించిన వివరాలు ఉండకూడది నిర్ణయించారు.

అనవసరంగా లేని అతికిపోయి ఇబ్బందులు తెచ్చుకోవడం అనవసరం అనే నిర్ణయానికి వచ్చారు.కొందరు స్టార్ హీరోలకు మాత్రం ఈ మోజు అస్సలు తీరడం లేదు.తాజాగా పుష్ప సినిమాకు కూడా ఇలాంటి పోస్టరే ఒకటి విడుదల అయ్యింది.పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.365 కోట్లు వసూలు చేసిందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.అది చూసి జనాలు నవ్వుకుంటున్నారు.

భారీ వసూళ్లు సాధించిన మాట వాస్తవం.కానీ మరీ 365 కోట్లు సాధించిందా? అంటూ సేటైర్లు వేస్తున్నారు.

ఇప్పటికే ఏపీలో టిక్కెట్ల రేట్లు తగ్గించింది అక్కడి సర్కారు.దీంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని పలువురు నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వ పెద్దలు కూడా ఈ కలెక్షన్ల గురించే పెద్దగా మాట్లాడుతున్నారు.ఓవైపు ఇన్ని కోట్ల రూపాయలు సాధించామని చెప్తూ.నష్టాలు వచ్చాయని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు.మీరు చెప్పినట్లు ఆదాయ పన్ను కడుతున్నారని అంటున్నారు.

ఇంత భారీ వసూళ్లు వస్తుంటే.మళ్లీ టిక్కెట్ల రేట్లు పెంచడం ఎందుకు అంటున్నారు.

ఈ సమయంలో సినిమా నిర్మాతలు కాస్త సైలెంట్ గా ఉండటం మానేసి.కోట్ల రూపాయలు వసూళ్లు వస్తున్నాయని పోస్టర్లు వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Pushpa Posters Hype In Bollywood , Pushpa, Bollywood, Ram Charan, Allu Arjun, Sukumar, Rashmika - Telugu Allu Arjun, Bollywood, Pushpa, Pushpa Posters, Pushpaposters, Ram Charan, Rashmika, Sukumar

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube