వామ్మో.. పుష్ప సినిమా కాపీ కథనా.. వైరల్‌గా మారిన ఆ జర్నలిస్ట్ పోస్ట్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ క్రియేటివ్ డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.ఈయన రచయితగా మంచి మంచి సినిమాలను తెరకెక్కించాడు.

 Pushpa Movie Was Copy Article That Journalist Post That Went Viral What Is The A-TeluguStop.com

చాలా వరకు స్టార్ హీరో ల సినిమాలకు దర్శకత్వం వహించాడు సుకుమార్.ఇదిలా ఉంటే లెక్కల మాస్టర్ గా కూడా బిరుదు సంపాదించుకున్న సుకుమార్.

.లెక్కల్లో మార్పులు వచ్చాయని తెలుస్తుంది.

ఇటీవలే సుకుమార్ తన దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ఇందులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఇండియన్ క్రష్ రష్మిక మందన నటీనటులుగా నటించారు.

ఈ సినిమా శుక్రవారం విడుదల కాగా మొదటిరోజు ఓ రేంజ్ లో సందడి చేసింది.ఇక ఈ రెండు రోజుల్లో కూడా పరవాలేదు అన్నట్లుగానే ఉంది.

కానీ సినిమా ఎందుకో ప్రేక్షకులను మెప్పించలేనట్లు అనిపిస్తుంది.పైగా యావరేజ్ టాక్ కూడా వినిపిస్తుంది.అల్లు అర్జున్ తన నటన తో బాగా మెప్పించిన కూడా ఎక్కడో ఈ సినిమాలో కాస్త సుకుమార్ లెక్కలు తప్పినట్లు తెలుస్తోంది.మామూలుగా సుకుమార్ సొంతంగా కథలు రూపొందిస్తాడు అని ఒక పేరు మాత్రం ఉంది.

కాని పుష్ప సినిమాతో ఆ పేరు పోయినట్లు కనిపిస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో చూద్దాం.

కవి, రచయిత గా మంచి పేరు సంపాదించుకున్న ఆదినారాయణ అనే జర్నలిస్టు చాలా ఏళ్లుగా జర్నలిస్ట్ గా పని చేస్తున్నాడు.ఈయనకు సినిమా కథలు రాయడం లో మంచి ప్రావీణ్యం ఉంది.

అంతేకాకుండా అద్భుతమైన రివ్యూలు రాస్తూ ఉంటాడు.

రంగస్థలం సినిమా రివ్యూ తో సుకుమార్ ప్రశంసలు అందుకొని ఆ సమయంలోనే ఆయనను కలుసుకున్నాడు.ఆ సమయంలో కే జి ఎఫ్ బ్యాగ్రౌండ్ స్థాయి కథ కావాలని ఆదినారాయణను సుకుమార్ కోరాడట.దీంతో ఆయన రెడ్ శాండిల్ నేపథ్యంలో పుష్ప లైన్ ఇచ్చానని తెలిపాడు.

అంతే కాకుండా మాస్ ఎలిమెంట్స్ కావాలంటే కంటెంట్ కూడా ఇచ్చాను అని తెలిపాడు.ఇక తన కథను సుకుమార్ నొక్కేసాడు అంటూ గంగా ఓ పోస్టు కూడా పెట్టాడు.ప్రస్తుతం ఆ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఆ పోస్టు ఎలా పెట్టాడు అంటే పుష్ప సినిమాలో సెన్సేషనల్ క్రియేట్ చేసిన ఐటమ్ సాంగ్ ‘ఊ.

అంటావా.మావా.

ఊహూ.అంటావా మావా’ పాటతో తాను చెప్పాల్సిన మాటలు బయట పెట్టేసాడు.

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ (టిట్టీటిటిట్టీటిటిట్టీటి) కథ లేదు కాకర లేదు.స్టోరీ లేపుటలో తిరుగేలేదు సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.అంటావా వేమా ఊహూ.అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

రంగస్థలం రివ్యూ రాస్తే రారమ్మని పిలిచేడూ.

కాఫీ ఇచ్చి కూర్చోబెట్టి కూపి లెన్నో లాగాడు.సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.

అంటావా వేమా ఊహూ.అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

కేజిఎఫ్ రేంజ్ లోన కథ కావాలన్నాడడూ.

నా దగ్గర రెండు లైన్లు.ఒకటేమో ఇసుకదుందీ రెండోదేమో ఎర్రచందనమన్నా.

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.అంటావా వేమా ఊహూ.

అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

రెడ్ శాండిల్ స్టోరీ నచ్చి మాస్ ఎలిమెంట్ లేదన్నాడూ డ్రైవర్ లేడా? ఎర్ర కూలీ లేడా? ఇంతకన్నా ఏముందన్నా

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.అంటావా వేమా ఊహూ.

అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ ఎన్నో పట్టుకెళ్లి ఇచ్చేవచ్చా సుకుమార్ అంటే పెద్ద డైరెట్రూ అంతా మంచే నమ్మా నేను.సుక్కూ అంటే కాపీ క్యాట్ కాజేయుటలో అతడే గ్రేటూ

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.

అంటావా వేమా ఊహూ.అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

కథ మొత్తం దొబ్బేశాక నన్ను దూరం పెట్టేశాడు వాట్సప్పూ బంధు పెట్టి నా లైన్ మొత్తం కట్టు జేసి.

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.అంటావా వేమా ఊహూ.

అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

మంచి లేదు చెడ్డాలేదూ దొబ్బిందానికి చిల్లి కానీ లేదూ చెప్పేవేమో శ్రీరంగనీతులు చేసేవేమో దొంగ పనులు

సుక్కూ అంటే కాఫీ క్యాటూ కాజేయుటలో అతడే గ్రేటూ

ఊ.అంటావా వేమా ఊహూ.అంటావా వేమా (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

ఊ.అంటాన్రా ఆదీ ఊహూ అంటే పాపం తగిలేన్రా.మాకీ (టిట్టీటిటిట్టీటిటిట్టీటి)

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube