నెట్టింట వైరల్ అవుతున్న పుష్ప విలన్ ఫోటో.. !

సైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు.అల వైకుంఠపురంలో సినిమాతో సూపర్ హిట్ కొట్టిన అల్లు అర్జున్ వెంటనే సుకుమార్ తో పుష్ప సినిమా మొదలు పెట్టాడు.

 Pushpa Movie Villain Fahad Fazil Pic Viral In Social Media, Allu Arjun, Pushpa,-TeluguStop.com

ఇందులో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తున్నాడు.ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప నుండి విడుదలైన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది.రష్మిక ఒక గిరిజన యువతిగా నటిస్తున్నట్టు టాక్.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.సుకుమార్ దర్శకత్వంలో బన్నికి ఇది మూడో సినిమా గా తెరకెక్కుతుంది.

మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.అల్లు అర్జున్ మొదటి సారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాలో విలన్ రోల్ కోసం మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ ను తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు.ప్రస్తుతం ఈ సినిమాలో నటించే విలన్ ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ మధ్య ఇతడి పేరు మారు మోగిపోతుంది.ఇతడు తెలుగుతో పాటు తమిళ్ విక్రమ్ సినిమాతో తన మార్కెట్ ను పెంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కష్టపడుతున్నాడు.

Telugu Allu Arjun, Fahad Fazil, Pushpa, Pushpa Villain, Pushpavillain-Movie

ఇది ఇలా ఉండగా ఈయనకు బట్ట తల ఉన్నప్పటికీ విగ్గుతో నటించకుండా తన ఒరిజినల్ లుక్ లోనే ప్రతి సినిమాలో కనిపిస్తాడు.కానీ తాజాగా ఈయన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.ఈ పిక్ లో ఫహద్ జుట్టు పెంచుకుని గడ్డం కూడా బాగా పెంచి కనిపిస్తున్నాడు.ఇప్పుడు ఈ ఫోటో గురించే ఇప్పుడు అందరు చర్చించు కుంటున్నారు.ఈయన ఒరిజినల్ గా జుట్టు పెంచుకున్నాడేమో అని అందరు భావించారు.

కానీ ఈ ఫోటో గురించి ఫహద్ తాజాగా స్పందించారు.

ఈ ఫోటో ఒరిజినల్ ఫోటో కాదని అతడి ఫ్యాన్ ఫోటోను మార్ఫింగ్ చేసాడని తెలిపాడు.అయితే ఈ పిక్ చాలా నాచ్యురల్ గా కనిపిస్తుంది.

అస్సలు ఈ ఫోటోను క్రియేట్ చేసి ఉండొచ్చని అస్సలు అనిపించడం లేదు.ఈ ఫోటో చుసిన ఎవ్వరైనా ఇది ఒరిజినల్ పిక్ అనే అనుకుంటారు.

అంత బాగున్న పిక్ ను మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube