పుష్ప సినిమా అన్ని భాషల్లో రిలీజవుతోందా..?- Pushpa Movie To Be Made In More Than Five Languages Says Movie Team

pushpa movie to be made in more than five languages says movie team, 10 languages, allu arjun, pushpa movie, rugged look - Telugu 10 Languages, Allu Arjun, Pushpa Movie, Rugged Look

స్టార్ హీరో అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కొరకు భారీ మొత్తం ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.

 Pushpa Movie To Be Made In More Than Five Languages Says Movie Team-TeluguStop.com

ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.మొదట పుష్ప సినిమా ఐదు భాషల్లో తెరకెక్కుతున్నట్టు వార్తలు రాగా ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోందని సమాచారం.

రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన రెడ్ సినిమా ఎనిమిది భాషల్లో రిలీజ్ కాగా పుష్ప సినిమా అంతకు మించి ఎక్కువ భాషల్లో విడుదలవుతూ ఉండటం గమనార్హం.యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఎక్కువ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం.

 Pushpa Movie To Be Made In More Than Five Languages Says Movie Team-పుష్ప సినిమా అన్ని భాషల్లో రిలీజవుతోందా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బన్నీకి జోడీగా రష్మిక మందన్నా ఈ సినిమాలో నటిస్తున్నారు.బన్నీ, రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం.

మొదట పుష్ప సినిమా కన్నడ, మలయాళం, హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది.ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతుండగా మిగిలిన ఐదు భాషల సంగతి తెలియాల్సి ఉంది.ఇప్పటికే బన్నీకి మలయాళంలో క్రేజ్ ఉండగా ఈ సినిమాతో ఇతర భాషల్లో కూడా క్రేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.బన్నీ చెల్లెలి పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నట్టు వార్తలు వస్తుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో లారీ డ్రైవర్ పాత్రలో అల్లు అర్జున్ నటిస్తున్నారు.ఈ సినిమాలో బన్నీ రగ్గుడ్ లుక్ తో కనిపిస్తూ ఉండటం గమనార్హం.

ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

#Rugged Look #Allu Arjun #10 Languages

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు