'పుష్ప' అప్డేట్.. అద్భుతమైన లొకేషన్ లో షూటింగ్ అంటూ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

 Pushpa Movie Shooting In An Amazing Location Details, Sid Sriram, Pushpa, Allu A-TeluguStop.com

అల్లు అర్జున్ కూడా మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడంతో ఈ సినిమా కోసం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో బన్నీ పుష్ప రాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.బన్నీ మునుపెన్నడూ లేనంత మాస్ లుక్ లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె గిరిజన యువతీ పాత్రలో కనిపించ బోతుంది.

ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ‘దాక్కో దాక్కో మేక‘ విడుదల అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా విడుదల చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు.

Telugu @pushpamovie, Allu Arjun, Mythri Makers, Pushpa, Sid Sriram, Sukumar-Movi

ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ సెకండ్ సింగిల్ ను సిద్ శ్రీరామ్ చేత రికార్డ్ కూడా చేయించాడని వార్తలు హల్ చల్ చేసాయి.ఈ నేపథ్యంలో ఈ సెకండ్ సింగిల్ త్వరలోనే మన ముందుకు రాబోతుందని తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుండి మేకర్స్ తాజాగా ఒక అప్డేట్ ఇచ్చారు.

ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ జరుగుతుందని తెలిపారు.

ఒక అద్బుతమైన లొకేషన్ లో ఈ పాట షూటింగ్ జరుపుకుంటుందని ఒక ఫోటోను కూడా విడుదల చేసారు.

Telugu @pushpamovie, Allu Arjun, Mythri Makers, Pushpa, Sid Sriram, Sukumar-Movi

ఆ ఫోటోను చూస్తేనే అర్ధం అవుతుంది లొకేషన్ ఎంత బాగుందో.ఆ ఫొటోలో చుట్టూ పచ్చని చెట్లు పక్కనే ఒక నది కనిపిస్తూ ఉంది.ఇక అక్కడే ఈ సినిమా లోని ఒక పాట షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది.మొదటి భాగం పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube