పుష్ప సెకండ్ సింగిల్ ఆ సింగర్ తోనే ఉండబోతుందా!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప.ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.

 Pushpa Movie Second Single With Star Singer Sid Sriram-TeluguStop.com

అల్లు అర్జున్ కూడా మొదటిసారి పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడని అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో ఎర్ర చందనం స్మగ్లర్ గా లారీ డ్రైవర్ గా నటిస్తున్నాడు.బన్నీ మాస్ లుక్ లో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.

 Pushpa Movie Second Single With Star Singer Sid Sriram-పుష్ప సెకండ్ సింగిల్ ఆ సింగర్ తోనే ఉండబోతుందా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.ఈమె గిరిజన యువతీ పాత్రలో కనిపించ బోతుంది.

ఈ సినిమా నుండి ఇప్పటికే ఫస్ట్ సింగిల్ విడుదల అయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక ఇప్పుడు పుష్ప సెకండ్ సింగిల్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Telugu @pushpamovie, Allu Arjun, Mythri Movie Makers, Pushpa, Pushpa Movie Second Single With Star Singer Sid Sriram, Pushpa Movie Update, Pushpa Second Single, Rashmika Mandanna, Sid Sriram, Sukumar-Movie

ఇక ఈ సాంగ్ గురించి ఎప్పుడో సమాచారం బయటకు వచ్చింది.ఈ సాంగ్ పుష్పరాజ్ కు రష్మిక కు మధ్య ఉంటుందని ఇది ఒక రొమాంటిక్ సాంగ్ అని ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది.ఇక తాజాగా ఈ సాంగ్ ఎవరు పాడారో కూడా బయటకు వచ్చింది.ఈ పాటను ఒక స్టార్ సింగర్ పాడారని వార్తలు వస్తున్నాయి.

Telugu @pushpamovie, Allu Arjun, Mythri Movie Makers, Pushpa, Pushpa Movie Second Single With Star Singer Sid Sriram, Pushpa Movie Update, Pushpa Second Single, Rashmika Mandanna, Sid Sriram, Sukumar-Movie

దేవి శ్రీ ప్రసాద్ పుష్ప సెకండ్ సింగిల్ ను స్టార్ సింగర్ తో కలిసి రికార్డు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.టాలీవుడ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించినట్టు తెలుస్తుంది.మరి అదే నిజమైతే ఈయన గాత్రంతో మరొకసారి ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేయడం ఖాయం.అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతుండగా అవి పుష్ప సాంగ్ కోసమే అని రూమర్స్ వినిపిస్తున్నాయి.

మరి ఎంతగానో ఎదురు చూస్తున్న సెకండ్ సింగిల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

#PushpaSingle #Sriram #Sukumar #Pushpa #Pushpa

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు