స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప’ నుండి తాజాగా మరో అప్డేట్ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేస్తున్నట్లు ప్రకటించింది.దీంతో ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ఈ సినిమా టీజర్ రిలీజ్‌ను గురించి ఏదైనా అప్డేట్ ఉంటుందేమో అని అందరూ అనుకున్నారు.కానీ ఈ సినిమా రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేసింది.
పుష్ప చిత్రాన్ని ఆగష్టు 13న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఈ పోస్టర్లో అల్లు అర్జున్ చేతిలో ఓ గొడ్డలి పట్టుకుని ఒక గుంపు మధ్యలో కూర్చున్నాడు.ఈ సినిమాను పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే తెలిపిన సంగతి తెలిసిందే.
అయితే ఈ పోస్టర్ చూస్తే ఈ సినిమా ఏ రేంజ్లో మాస్ అంశాలు ఉండబోతున్నాయో మనకు ఇట్టే అర్థమవుతుంది.ఇక ఈ సినిమాలో పుష్పక్రాజ్ అనే పాత్రలో ఊరమాస్ లుక్‌లో మనకు కనిపిస్తున్నాడు.
సుకుమార్ ఈ సినిమాను పూర్తి రివెంజ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుండగా, ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కూడా అందరిలో నెలకొంది.
ఇక పాన్ ఇండియా చిత్రంగా ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఏదేమైనా పుష్ప సినిమాను ఆగస్టు 13న రిలీజ్ చేస్తుండటంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.