Pushpa Russia: పుష్ప ను రష్యాలో ప్రమోట్ చేసేందుకు చేస్తున్న ఖర్చు ఎంతంటే..!

అల్లు అర్జున్ హీరో గా గత సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఇప్పుడు మళ్లీ రిలీజ్ కి సిద్ధం అయింది.అయితే ఈసారి రష్యా దేశం లో పుష్ప సినిమా రిలీజ్ కాబోతుంది.

 Pushpa Movie Promotions In Russia Moscow Details, Allu Arjun, Pushpa, Rashmika M-TeluguStop.com

తెలుగు లో మన ఇండియా లో విడుదలై సరిగ్గా సంవత్సరం కాబోతున్న సమయం లో రష్యన్ లాంగ్వేజ్ లో పుష్ప సినిమా విడుదల కాబోతుండడం అందరికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఏదో విడుదల చేశాం అంటే చేశాం అన్నట్లుగా కాకుండా పుష్ప సినిమా ను రష్యన్ లాంగ్వేజ్ లో పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు.

హీరో, దర్శకుడు, హీరోయిన్, సంగీత దర్శకుడు, నిర్మాతలు ఇలా చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా రష్యాలోని మాస్కో లో సందడి చేస్తున్నారు.

గత మూడు నాలుగు రోజులుగా అత్యంత కీలక ప్రదేశాల్లో తిరుగుతూ సినిమా ను ప్రమోట్ చేయడం తో పాటు రష్యన్‌ మీడియా ముందు తమ సినిమా యొక్క గొప్పతనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

రష్యా స్థానికులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.పుష్ప సినిమా రష్యన్ లాంగ్వేజ్ లో విడుదల చేయడానికి కాస్త ఎక్కువగానే మైత్రి మూవీ మేకర్స్ వారు ఖర్చు చేస్తున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం రష్యా లో విడుదల చేయడానికి మరియు అక్కడ చిత్ర యూనిట్ సభ్యులు ప్రమోషన్ చేయడానికి ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Telugu Allu Arjun, Mytri Makers, Pushpa, Pushpa Russia, Sukumar, Telugu, Top Tel

మరి ఆ స్థాయిలో ఈ సినిమా అక్కడ కలెక్షన్స్ నమోదు చేయగలదా అంటే కచ్చితంగా అంతకు మించి చేస్తుంది అంటూ యూనిట్ సభ్యులందరికి ధీమా తో ఉన్నారు.అక్కడ ప్రమోషన్ ఖర్చు కాస్త ఎక్కువైనా కూడా కలెక్షన్స్ కూడా అదే స్థాయిలో వస్తాయని అంటున్నారు.సినిమా కు మినిమం సక్సెస్ టాక్ దక్కితే చాలు ఈజీగా 20 నుండి 25 కోట్ల రూపాయల కలెక్షన్స్ అక్కడి నుండి వచ్చి పడతాయని అంతా భావిస్తున్నారు.

మరి మైత్రి మూవీ మేకర్స్ వారి నమ్మకం ఎంత వరకు నిజమవుతుంది అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube