ఉత్తరాదిన పరువు పోయింది.. ఇది మరో 'తుఫాన్‌' అయ్యింది

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా నేడు విడుదల అయ్యింది.ఈ సినిమా ను పాన్ ఇండియా పరిధిలో విడుదల చేయడం జరిగింది.

 Pushpa Movie Hindhi Dubbing Version Collections Details, Allu Arjun, Pushpa, Pus-TeluguStop.com

ఉత్తరాదిన ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.అల్లు అరవింద్ కు ఉన్న అక్కడ పరిచయాలతో పుష్ప ను భారీగా విడుదల చేశారనే వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టాక్‌ నెగటివ్ గా ఉంది.సినిమాకు వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా ఉత్తరాధిన సినిమా మరీ తక్కువ వసూళ్లను నమోదు చేసింది.

కొన్ని ఏరియాల్లో కనీసం 5 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు.మొదటి రోజు నాలుగు ఆటలకు గాను హిందీ వర్షన్‌ 25 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే దక్కించుకుందనే వార్తలు వస్తున్నాయి.

బన్నీ వంటి మాస్‌ హీరో సినిమా మొదటి రెండు మూడు రోజులు కూడా నూరు శాతం ఆక్యుపెన్సీ దక్కించుకుంటుంది.అలా దక్కించుకుంటేనే బ్రేక్‌ ఈవెన్ కు అవకాశాలు ఉంటాయి.

హిందీ వర్షన్ కొనుగోలు చేసిన వారికి నెత్తిన పెద్ద గుండు పడ్డట్లే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.దాదాపుగా 20 కోట్లకు పైగా పుష్ప సినిమా హిందీ థియేట్రికల్‌ రైట్స్ ను కొనుగోలు చేయడం జరిగింది.

కాని అక్కడ 5 కోట్లు రాబట్టడం చాలా గొప్ప విషయం అయ్యింది అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Allu Arjun, Occupancy, Pan India, Pushpa, Pushpa Hindhi, Pushpa Hindi, Ra

ఏం జరుగుతుందా అంటూ హిందీ మీడియా వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.బిగ్గెస్ట్‌ బ్లాక్ బస్టర్ మూవీగా రూపొందిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకులు ఖచ్చితంగా ఆధరిస్తారని అంతా ఆశించారు.కాని ఫలితం తారు మారు అయ్యింది.

ఈ ఫలితంపై బన్నీ రియాక్షన్ ఏంటో మరి చూడాలి.గతంలో చరణ్‌ కు తుఫాన్‌ కూడా ఇలాగే హిందీలో దారుణమైన పరాజయం రుచి చూపింది.

కనుక బన్నీకి ఇది ఒక తుఫాన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube