అప్పుడే రికార్డుల వేట మొదలెట్టిన అల్లు అర్జున్ పుష్ప….  

Pushpa Movie Allu Arjun Sukumar Twitter Likes Comments Tollywood Rashmika Mandanna - Telugu Allu Arjun, Comments, Pushpa Movie, Rashmika Mandanna, Sukumar, Tollywood, Twitter Likes

టాలీవుడ్ లో ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నటువంటి “పుష్ప” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక నటిస్తోంది.

 Pushpa Movie Allu Arjun Sukumar Twitter Likes Comments Tollywood Rashmika Mandanna

అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ పోస్టర్లు అల్లు అర్జున్ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8వ తారీఖున విడుదల చేశారు.

అప్పుడే రికార్డుల వేట మొదలెట్టిన అల్లు అర్జున్ పుష్ప….-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఈ పోస్టర్లు విడుదలైన ఒక్కరోజులోనే దాదాపుగా 89 వేల పైచిలుకు లైకులు, అలాగే 31 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.అయితే ఇలా ఒక్కరోజులోనే ఇన్ని లైకులు కామెంట్లు రావడం ఇదే మొదటిసారి.

దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో అని.అంతేగాక అల్లు అర్జున్ మాస్ లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులు కేరళ రాష్ట్రంలో జరుగుతుండగా కరోనా వైరస్ కారణంగా కొంత కాలం పాటు నిలిపివేశారు.దీంతో ఈ చిత్రం విడుదలపై కొంత సందిగ్ధత నెలకొంది.

అయితే ఈ చిత్రాన్ని దాదాపుగా ఐదు భాషల్లో విడుదల చేసేందుకు దర్శకుడు సుకుమార్ సన్నాహాలు చేస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Allu Arjun Pushpa Movie Start Hunting For The Records Related Telugu News,Photos/Pics,Images..