హిందీ డిస్టిబ్యూటర్స్ కు భారీ షాక్ ఇచ్చిన పుష్ప మేకర్స్ ..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

 Pushpa Makers Shock To Hindi Distributors, Hindi Distributors, Allu Arjun , Pushpa 2 , Director Sukumar , Pushpa 2 Shooting-TeluguStop.com

పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.

ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది.

 Pushpa Makers Shock To Hindi Distributors, Hindi Distributors, Allu Arjun , Pushpa 2 , Director Sukumar , Pushpa 2 Shooting-హిందీ డిస్టిబ్యూటర్స్ కు భారీ షాక్ ఇచ్చిన పుష్ప మేకర్స్ ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో విడుదల అయినా పుష్ప సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది.డబ్బింగ్ వర్షన్ ఈ స్థాయి కలెక్షన్స్ రాబట్టడం అందులో ప్రొమోషన్స్ కూడా చేయకుండానే 100 కోట్ల మార్క్ టచ్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.

అప్పుడు హడావుడిగా రిలీజ్ చేయడంతో పెద్దగా ప్రొమోషన్స్ చేయడానికి కూడా సమయం సరిపోకపోవడంతో బాలీవుడ్ డిస్టిబ్యూటర్స్ కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ చూపించలేదు.దీంతో మేకర్స్ కూడా అక్కడికి వెళ్లి ప్రచారం చేయలేదు.

అయినా కూడా భారీ వసూళ్లు రాబట్టడంలో పార్ట్ 2 పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే భారీ స్థాయిలో హిందీ డబ్బింగ్ రేట్స్ కు గట్టిపోటీ నెలకొందట.

దీంతో మేకర్స్ ఈ సినిమా హిందీ రైట్స్ విషయంలో బాలీవుడ్ డిస్టిబ్యూటర్స్ కు షాక్ ఇచ్చిందట.పార్ట్ 2 కోసం భారీగా ఖర్చు చేయాలనీ అనుకుంటున్నారట.

అందులో భాగంగానే భారీ తారాగణం తో పాటు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేసి మరింత భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారని టాక్ వినిపిస్తుంది.జులై నుండి షూట్ ను మారేడుమిల్లి లోనే స్టార్ట్ చేసి వచ్చే ఏడాది జనవరి వరకు షూట్ పూర్తి చేసి ఈ సినిమాను కూడా ఎలాంటి ఆర్భాటాలు లేకుండా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.అందుకే అప్పుడే హిందీ డిస్టిబ్యూటర్స్ కు భారీ డిమాండ్ ఉన్న ఇవ్వకూడదని హోల్డ్ లో పెట్టారట.ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube