పుష్ప పోస్టర్ కూడా కాపీయేనా?  

Pushpa First Look Copied From Hollywood - Telugu Allu Arjun, First Look, Hollywood, Pushpa, Sukumar

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ముచ్చటగా మూడోసారి నటిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

 Pushpa First Look Copied From Hollywood

అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను బన్నీ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయగా అది సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

పూర్తి మాస్ లుక్‌లో వచ్చిన ఈ పోస్టర్ చూస్తుంటే బన్నీ మరోసారి ఇండస్ట్రీ రికార్డులకు ఎసరు పెట్టాడని చిత్ర వర్గాలు అంటున్నాయి.

పుష్ప పోస్టర్ కూడా కాపీయేనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.అయితే ఈ పోస్టర్‌ను దర్శకుడు సుకుమార్ హాలీవుడ్ నుండి కాపీ కొట్టాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

గతంలో 1-నేనొక్కడినే ఫస్ట్ లుక్‌ను కూడా సుకుమార్ హాలీవుడ్ నుండి ఎత్తేశాడని, ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘షెర్లాక్ హోమ్స్’ పోస్టర్‌కు జిరాక్స్ కాపీలా పుష్ప ఫస్ట్ లుక్ ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అయితే బన్నీ యాంటి ఫ్యాన్స్ మాత్రమే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని, సినిమా పూర్తి వైవిధ్యమైన కథతో రానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

పుష్పక్ రాజ్ పాత్రలో బన్నీ రెచ్చిపోవడం ఖాయమని, సుకుమార్‌తో కలిసి హ్యాట్రిక్ కొట్టేందుకు బన్నీ రెడీ అయ్యాడని వారు అంటున్నారు.ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Pushpa First Look Copied From Hollywood Related Telugu News,Photos/Pics,Images..