పుష్ప పరిస్థితి దారుణం.. సగానికి సగం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన రీసెంట్ మూవీ అల వైకుంఠపురములో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ తన నెక్ట్స్ మూవీని అప్పుడే లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.

 Pushpa Budget To Be Reduced To Half, Pushpa, Allu Arjun, Sukumar, Rashmika Manda-TeluguStop.com

ఇప్పటికే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు బన్నీ.కాగా ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దేందుకు రెడీ అయ్యాడు సుకుమార్.

అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.ఇప్పటికే ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, కరోనా కారణంగా షూటింగ్‌ను వాయిదా వేసుకుంది.

అయితే ఇప్పట్లో కరోనా వైరస్ విజృంభన తగ్గే సూచనలు కనిపించకపోవంతో ఈ సినిమా షూటింగ్‌ను మరింత ఆలస్యంగా మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఇప్పటికే ఈ సినిమా సెట్ల కోసం భారీగా ఖర్చు పెట్టిన చిత్ర యూనిట్, రాబోయే రోజుల్లో ఈ బడ్జెట్‌ను భారీగా తగ్గించేందుకు సిద్ధమైంది.

అయితే తొలుత ఈ సినిమా బడ్జెట్‌ను కొంత మేర తగ్గించాలని అనుకున్నా, ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా ఈ బడ్జెట్‌ను సగానికి సగం కుదించాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.రాబోయే రోజుల్లో థియేటర్లకు జనాలు తక్కువగానే వస్తారని ప్రస్తుత పరిస్థితులు తెలియజేస్తుండటంతో, ఈ సినిమా రిలీజ్ అయ్యే నాటికి కూడా థియేటర్ల నుండి భారీ మొత్తంలో కలెక్షన్స్ రావడం అసాధ్యంగా కనిపిస్తుండటంతో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారట చిత్ర యూనిట్.

మరి ఈ విషయంలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మాత్రం చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube