ప్రభాస్‌ను దాటేసిన బన్నీ.. అవాక్కవుతున్న ఫ్యాన్స్!  

Pushpa Budget Crossed Prabhas 20 - Telugu Allu Arjun, Prabhas, Prabhas 20, Pushpa, Tollywood News

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప లాక్‌డౌన్‌కు ముందే షూటింగ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Pushpa Budget Crossed Prabhas 20

ఇక ఈ సినిమాతో బన్నీ మరోసారి బాక్సాఫీస్‌ను దున్నేయడం ఖాయమని చిత్ర యూనిట్ భావిస్తోంది.కాగా ఓ విషయంలో ఈ సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రాన్ని దాటేసిందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

పుష్ప చిత్రాన్ని పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్, దీనిని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తోంది.ఇక అడవి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా కోసం భారీ అడవి సెట్టింగ్‌ను వేస్తున్నారు.

ప్రభాస్‌ను దాటేసిన బన్నీ.. అవాక్కవుతున్న ఫ్యాన్స్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కాగా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించిన చిత్ర యూనిట్, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ కారణంగా తమ బడ్జెట్‌ను పెంచాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే ఈ సినిమా బడ్జెట్ ఎక్కువైందట.

ఈ లెక్కన ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రం కంటే కూడా పుష్ప సినిమా బడ్జెట్ ఎక్కువైనట్లు తెలుస్తోంది.ప్రభాస్ నటిస్తున్న 20వ చిత్రాన్ని జిల్ ఫేం రాధాకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి.

మరి నిజంగానే పుష్ప సినిమా బడ్జెట్ ప్రభాస్ సినిమాను దాటేసిందా అనే విషయంపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test