Kantara Puspa : పుష్ప వర్సెస్‌ కాంతార... చివరి నిమిషంలో చేజారిన రికార్డ్‌

కన్నడ సినిమా కాంతార భారీ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులను నమోదు చేసింది.ఆశ్చర్యపోయే విధంగా సినిమా వసూళ్లు ఉన్నాయి.

 Pushpa And Kantara Collections Interesting Update , Kantara,pushpa , Rishab She-TeluguStop.com

ముఖ్యంగా కాంతార సినిమా కన్నడ వసూళ్లతో పాటు హిందీ మరియు తెలుగు వసూళ్లు కూడా ఆశ్చర్యపర్చుతున్నాయి.కన్నడం లో ఇప్పటి వరకు ఏ సినిమా సాధించని వసూళ్లు సాధించి కేజీఎఫ్ 2 రికార్డును సైతం బ్రేక్ చేసింది.

కన్నడంలో కేజీఎఫ్ 2 యొక్క రికార్డు ను బ్రేక్‌ చేయాలంటే రాబోయే నాలుగు అయిదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు అంటూ అంతా అనుకున్నారు.కానీ కాంతార సినిమా సాధించిన వసూళ్లు అద్భుతం అన్నట్లుగా ఉన్నాయి.

బాబోయ్ ఇదేం రచ్చ నాయనో అంటూ చాలా మంది కూడా ముక్కున వేలేసుకునే విధంగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి.కాంతార సినిమా తాజాగా 400 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి సరికొత్త బెంచ్ మార్క్ ను క్రియేట్‌ చేసింది.

Telugu Kantara, Kgf, Pushpa, Rishab Shetty, Telugu, Top Telugu-Movie

ఇండియన్ సినీ చరిత్రలో 400 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన సినిమాల జాబితాలో కాంతార నిలిచింది.పుష్ప సినిమా 400 కోట్ల రూపాయలకు కాస్త దూరంలో నిలిచి పోయింది.కాంతార సినిమా కూడా కచ్చితంగా నాలుగు వందల కోట్ల రూపాయలను క్రాస్ చేయక పోవచ్చు.అలాగే కాంతార సినిమా యొక్క వసూళ్ల విషయంలో పుష్ప రికార్డ్‌ సేఫ్ అనుకున్నారు.

కానీ హిందీలో కాంతార సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లు చేసి ఆశ్చర్య పర్చింది.అంతే కాకుండా ఓవరాల్‌ గా కూడా కాంతార సినిమా పుష్ప కలెక్షన్స్ ను బ్రేక్ చేసింది.

అద్భుతమైన వసూళ్లు అంటూ కాంతార సినిమా వసూళ్లకు పేరు దక్కింది.కనుక కాంతార సినిమా ముందు ముందు కూడా కచ్చితంగా భారీ గా వసూళ్లు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.

కాంతార సినిమా తెలుగు లో దాదాపుగా 40 కోట్ల రూపాయల వసూళ్లను నమోదు చేసిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube