పుష్ప 2కి అడ్వాన్స్ తీసుకోని మైత్రి మేకర్స్.. ఎందుకంటే..!

సుక్కు, అల్లు అర్జున్ కలిసి చేసిన పుష్ప ది రైజ్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే.ఈ సినిమా విషయంలో అంచనాలన్ని తారుమారై హిట్ నుంచి సూపర్ హిట్ ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

 Pushpa 2 Mytri Movie Makers Doesnot Take Any Advances Details, Allu Arjun, Fahad-TeluguStop.com

బాలీవుడ్ లోనే పుష్ప పార్ట్ 1కి 120 కోట్ల దాకా వసూళ్లు వచ్చాయంటే ఆ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.ఇక పుష్ప పార్ట్ 1 ఎఫెక్ట్ పార్ట్ 2 పై పడింది.

పార్ట్ 1 ని మించి ఈ పార్ట్ 2 ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే పుష్ప 2 కి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు అడ్వాన్స్ రూపం లో వస్తున్నాయట.

పుష్ప 2 బిజినెస్ కూడా భారీగా జరుగనుంది.అయితే మైత్రి మూవీ మేకర్స్ మాత్రం పుష్ప 2 రైట్స్ ని అంత త్వరగా ఎవరికి ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యారట.

పుష్ప 1 తీసుకున్న గోల్డ్ మైన్స్ వారే పుష్ప 2 తీసుకునే అవకాశం ఉన్నా వారి దగ్గర కూడా అడ్వాన్స్ గా ఏమి తీసుకోలేదట.అంతేకాదు పెన్ ఎంటర్టైన్ మెంట్స్ నుంచి కూడా పుష్ప 2కి భారీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.

మైత్రి నిర్మాతలు మాత్రం సినిమా పూర్తయ్యాకనే బిజినెస్ డీల్ సెట్ చేసుకోవాలని అనుకుంటున్నారట.చూస్తుంటే వీరు పెద్ద ప్లాన్ లోనే ఉన్నారని అర్ధమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube