పుష్ప 2 కోసం కాజల్ 'ఉ' అంటుందా..!

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప ది రైజ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది.ఈ సినిమా నార్త్ ఆడియన్స్ కి బీభత్సంగా ఎక్కేసింది.

 Pushpa 2 Kajal Ready For Special Song Details, Kajal Agarwal, Pushpa 2, Samantha-TeluguStop.com

ఏమాత్రం అంచనాలు లేకుండా పుష్ప పార్ట్ 1 హిందీలో 100 కోట్ల పైన రికార్డ్ వసూళ్లని రాబట్టింది.పుష్ప ది రైజ్ లో సమంత చేసిన స్పెషల్ ఐటం సాంగ్ ఉ అంటావా మామా సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో తెలిసిందే.

ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో అక్కడ క్రేజ్ తెచ్చుకున్న సమంత ఈ సాంగ్ తో దుమ్ముదులిపేసింది.

ఇక ఇదిలాఉంటే పుష్ప 2 కోసం కూడా సుకుమార్ అదే రేంజ్ లో మరో స్పెషల్ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సాంగ్ కోసం ఈసారి కాజల్ అగర్వాల్ ని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారట.కాజల్ కూడా ఆల్రెడీ ఒకసారి స్పెషల్ సాంగ్ చేసింది.అయితే పెళ్లై ఓ పిల్లాడు కూడా ఉన్న కాజల్ ఈ టైం లో స్పెషల్ సాంగ్ కి ఓకే చెబుతుందా అన్నది డౌటే.కానీ కాజల్ తన కం బ్యాక్ ఓ రేంజ్ లో ఉండాలని ఆ సాంగ్ ఆఫర్ కి ఓకే చెప్పిందని అంటున్నారు.

పుష్ప 2 లో కాజల్ స్పెషల్ సాంగ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.అల్లు అర్జున్ తో ఆర్య 2 లో నటించింది కాజల్ మళ్లీ ఈ స్పెషల్ సాంగ్ తో జోడీ కడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube