పూరి, యష్ మూవీపై మరోసారి ఆసక్తికరమైన చర్చ

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఫెస్టివల్ తరువాత స్టార్ట్ చేయబోతున్నారు.

 Puri's Pan India Movie With Yash, Tollywood, Telugu Cinema, Bollywood, Kgf Chapt-TeluguStop.com

ఛార్మి, కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ స్ట్రైట్ హిందీ సినిమా ఒకటి చేస్తాడని టాక్ ఉంది.

అలాగే తెలుగులో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ కూడా చేసే అవకాశం ఉందని చర్చ నడుస్తుంది.ఇదే సమయంలో బాలకృష్ణతో మూవీ ఉండబోతుందని నందమూరి ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

ఇక పూరీ, పవన్ కళ్యాణ్ కలయికలో ఒక పొలిటికల్ యాక్షన్ మూవీ రాబోతుందని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.ఇలా ఎవరి ఆలోచనలలో వారు ఉన్నారు.

అయితే పూరీ జగన్నాథ్ ఒక ప్రాజెక్ట్ పట్టాలపై ఉండగా మరో ప్రాజెక్ట్ ని ఎప్పుడు అనౌన్స్ చేయలేదు.దీంతో అతను నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తాడనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఇదిలా ఉంటే మరో సారి పూరి ఫ్రేమ్ లోకి కన్నడ రాకింగ్ స్టార్ యష్ వచ్చాడు.పూరి జగన్నాథ్ కన్నడంలో రెండు సినిమాలు చేసి హిట్ కొట్టాడు.

ఆ విధంగా కన్నడ ప్రేక్షకులకి కూడా పూరి చేరువ అయిపోయాడు.ఈ నేపధ్యంలో రాఖీభాయ్ నెక్స్ట్ సినిమా పూరితో ఉండబోతుందనే చర్చ కన్నడ ఇండస్ట్రీలో మళ్ళీ మొదలైంది.

కేజీఎఫ్ 2 తర్వాత యష్ పూరితో కనెక్ట్ అవుతున్నాడని, వారి కాంబినేషన్ లో పాన్ ఇండియా రేంజ్ సినిమా ఒకటి రాబోతుందని టాక్ నడుస్తుంది.బాలీవుడ్ లో కూడా తన మార్క్ ని పరిచయం చేయాలంటే పవర్ ఫుల్ హీరోయిజం ఉన్న హీరోలు కావాలని ఫిక్స్ అయిన పూరికి డార్లింగ్ ప్రభాస్, విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయిలో మాసివ్ ఇమేజ్ ఉన్న యష్ పెర్ఫెక్ట్ అని అతనితో సినిమా ప్లాన్ చేస్తున్నాడని చెప్పుకుంటున్నారు.

త్వరలో దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ కూడా వస్తుందనే మాట బలంగా వినిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube