ఎమోషన్‌తో ఏడిపిస్తానంటోన్న పూరి  

Puri Jagannadh Vijay Devarakonda Movie Packed With Emotion - Telugu Ananya Pandey, Charmee Kaur, Puri Jagannadh, Vijay Devarakonda

ప్రస్తుతం టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా ఓ పాన్ ఇండియా మూవీని తెరకెక్కి్స్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

Puri Jagannadh Vijay Devarakonda Movie Packed With Emotion

ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యా్క్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్నట్లు చిత్ర యూనిట్ గతంలోనే వెల్లడించింది.

కాగా ఈ సినిమాలో విజయ్ ఓ బాక్సర్‌గా కనిపిస్తాడు.అయితే పూరి ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్‌ను కూడా భారీ స్థాయిలో చూపెట్టేందుకు రెడీ అవుతున్నాడట.

గతంలో పూరి డైరెక్ట్ చేసిన ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రం తరహాలో ఇది కూడా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతూనే ఎమోషనల్ కంటెంట్‌ను కలిగి ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది.

అటు విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఫిక్స్ అయ్యాడు.

ఇటీవల అతడు నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేయడంతో ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ కొట్టి తీరాలనే కసితో అతడు ఉన్నాడు.మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test