హిట్టుపడితేనే పూరితో చేస్తారట?  

Puri Jagannath Next Movies With Stars-balakrishna,ismart Shanker,mahesh Babu,prabhas,puri Jagannath,ram,ravi Teja

టాలీవుడ్ లో ఒకప్పుడు తనదైన శైలిలో బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న దర్శకుడు పురో జగన్నాథ్ ఇప్పుడు అవకాశాలు అందుకోవడమే కష్టంగా మారింది. చిన్నా పెద్దా తేడా లేకుండా దాదాపు స్టార్ హీరోలందరిని కవర్ చేసిన ఈ డ్యాషింగ్ డైరెక్టర్ నెక్స్ట్ స్టార్స్ తోనే చేయాలనీ ఫిక్స్ అయ్యాడు..

హిట్టుపడితేనే పూరితో చేస్తారట?-Puri Jagannath Next Movies With Stars

ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకుకుంటూనే అది సాధ్యపడుతుంది. చాలా రోజుల క్రితంమహేష్ తో జనగణమన అలాగే బాలయ్యతో మరో స్టయిలిష్ యాక్షన్ కథను సిద్ధం చేసుకున్నాడు.

మహేష్ సంగతి పక్కనపెడితే పైసా వసూల్ సినిమా ప్రమోషన్స్ లో పూరితో తప్పకుండా మరో సినిమా చేస్తానని చెప్పిన బాలకృష్ణ సినిమా రిలీజ్ అనంతరం మళ్ళీఆ విషయాన్నీ గుర్తు చేసుకోలేదు..

పూరి ఫామ్ లో పడితే గుర్తు చేయాలనీ బాలకృష్ణ ఫిక్స్ అయ్యాడట. ఇక మహేష్ బాబు కూడా పూరి జగన్నాథ్ సక్సెస్ అందుకుంటే జనగణమన చేయడానికి రెడీ అవుతాడట. ఇద్దరి స్టార్ హీరోలతో నెక్స్ట్ వర్క్ చేయాలంటే పూరి ఇస్మార్ట్ శంకర్ తో సక్సెస్ అందుకోవాల్సిందే.

జులై 18న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూద్దాం.