మహేష్‌ బాబును అవమానపర్చిన పూరి జగన్నాధ్‌  

Puri Jaganath Comments On Mahesh Babu-

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాద్‌ తాజాగా ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ టాక్‌ను దక్కించుకుంది.చాలా కాలంగా ఎదురు చూస్తున్న సక్సెస్‌ రావడంతో పూరి అండ్‌ టీం ఆనందంగా ఉంది...

Puri Jaganath Comments On Mahesh Babu--Puri Jaganath Comments On Mahesh Babu-

ఈ సమయంలోనే పూరి జగన్నాధ్‌ ఒక వివాదాస్పద విషయంలో చిక్కుకున్నాడు.సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.అది కూడా మహేష్‌ బాబు గురించి అవ్వడంతో ప్రస్తుతం పూరిపై మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఆగ్రహంతో ఉన్నారు.

Puri Jaganath Comments On Mahesh Babu--Puri Jaganath Comments On Mahesh Babu-

మహేష్‌బాబుతో పూరి జనగణమన చిత్రంను తెరకెక్కించేందుకు గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.అయితే మహేష్‌బాబు ఇతర ప్రాజెక్ట్స్‌ కారణంగా బిజీగా ఉన్నాడు.పూరి జగన్నాధ్‌ ఒక ఇంటర్వ్యూలో మహేష్‌తో సినిమా ఎప్పుడు అంటూ ఎదురైన ప్రశ్నకు నాకు సక్సెస్‌ ఉంటేనే నాతో మహేష్‌బాబు సినిమా చేస్తాడు అంటూ కామెంట్స్‌ చేశాడు.నేను ఎప్పుడైతే సక్సెస్‌ కొడతానో అప్పుడు మహేష్‌ నాతో జనగణమన చేస్తాడంటూ పూరి కామెంట్స్‌ చేయడంతో రచ్చ మొదలైంది.

పోకిరి సినిమాకు ముందు పూరి జగన్నాధ్‌కు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్‌లే పడ్డాయి.అయినా పోకిరితో ఛాన్స్‌ ఇచ్చాడు.బిజినెస్‌మన్‌ చిత్రంకు ముందు పూరి పనైపోయిందని చాలా మంది అన్నారు.అంతుకు ముందు చాలా నెలలుగా ఆయనకు సక్సెస్‌ లేదు.

దాంతో ఆయనకు బిజినెస్‌మన్‌తో సక్సెస్‌ దక్కింది.ఇలా పూరితో మహేష్‌ చేసిన రెండు సినిమాలు కూడా సక్సెస్‌ చూసి చేయలేదు.కాని పూరి మాత్రం తప్పుడు మాటలు మాట్లాడుతూ మహేష్‌బాబును అవమానపర్చాడు అంటూ మహేష్‌ ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు.

ఈ విషయమై మహేష్‌కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.