విజయ్ దేవరకొండ 10వ చిత్రంకు పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.ఫైటర్ అనే టైటిల్ను ఈ చిత్రంకు పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.
ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి.
అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా షురూ అవ్వబోతుంది.ఈ చిత్రాన్ని ఇన్ని రోజులుగా పూరి జగన్నాధ్ మరియు ఛార్మిలు మాత్రమే కలిసి నిర్మిస్తున్నారు అనుకున్నాం.
కాని ఈ చిత్ర నిర్మాణంలో మరొకరు జాయిన్ అయ్యారు.
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రం నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ మేకర్స్ పెట్టుబడులు పెట్టారు.ఈసారి కరణ్ జోహార్ తెలుగు సినిమా నిర్మాణంలో అడుగు పెట్టబోతున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఒక నిర్మాత అయిన ఛార్మి ప్రకటించింది.
కరణ్ జోహార్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వడం ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు.