విజయ్ దేవరకొండతో రొమాన్స్ కి రెడి అయిన అనన్య పాండే  

Puri Finalized Heroine For Vijay Devarakonda-charmi,fighter Movie,karan Johar,puri Finalized Heroine,tollywood,vijay Devarakonda

టాలీవుడ్ స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా బాక్సింగ్ నేపధ్యంలో సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ ఊపులోకి వచ్చిన పూరీ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.

Puri Finalized Heroine For Vijay Devarakonda-Charmi Fighter Movie Karan Johar Puri Tollywood Devarakonda

చార్మీ, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.తెలుగుతో పాటు, హిందీ, తమిళ భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయ్యింది.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుందని అందరూ భావించారు.

అలాగే ఆమె కూడా విజయ్ తో నటించడానికి గతంలో ఆసక్తి చూపించింది.ఈ నేపధ్యంలో టాలీవుడ్ కి ఆమెని పరిచయం చేసే బాద్యత పూరీ తీసుకున్నాడని టాక్ వచ్చింది.


అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం మూడు సినిమాలు వరకు పూర్తి చేయాల్సి ఉంది.దీంతో ఆమె షెడ్యూల్ ఖాళీ లేదు.ఈ నేపధ్యంలో చాలా మంది హీరోయిన్స్ పేర్లు విజయ్ కి జోడీగా పరిశీలించారు.ఫైనల్ గా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో పరిచయం అయిన అనన్య పాండేని హీరోయిన్ గా ఫైనల్ చేశారు.

ఈమెని హీరోయిన్ గా తీసుకోవాలని కరణ్ జోహార్ సూచించడంతో స్క్రీన్ టెస్ట్ చేసిన పూరీ ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.త్వరలో ఆమె చిత్ర యూనిట్ తో అఫీషియల్ గా ఆమెని ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.

మరి బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ డెబ్యూ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో అక్కడి యువ హీరోలకి ఏ మేరకు పోటీ ఇస్తాడు అనేది వేచి చూడాలి.

.

తాజా వార్తలు

Puri Finalized Heroine For Vijay Devarakonda-charmi,fighter Movie,karan Johar,puri Finalized Heroine,tollywood,vijay Devarakonda Related....