ఆ విషయంలో బ్రిటీషు వాళ్లే గొప్ప అంటున్న పూరీ..!

మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు పాలించిన బ్రిటీషు వారి నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి అని అంటున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్.ప్రపంచ దేశాలకి పాలన పాఠాలు నేర్పింది మాత్రం బ్రిటిష్ వాళ్ళు అని ఆయన తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.

 Puri Says The British Are Great In That Regard, Puri Jagannandh, Director, Briti-TeluguStop.com

తన పూరి మ్యూజింగ్స్ లో భాగంగానే పూరి జగన్నాథ్ తాజాగా బ్రిటిష్ వారి పాలన, వారి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.ఇందులో భాగంగానే మనందరికీ బ్రిటిష్ వాళ్ళంటే పడదు.

గతం గతః దాన్ని వదిలేద్దాం అనుకోండి.కాకపోతే ఒకసారి బ్రిటిష్ వారి గురించి ఆలోచిద్దాం.

ప్రస్తుతానికి బ్రిటన్లో బ్రిటిష్ వారి జనాభా కేవలం ఆరున్నర కోట్లు మాత్రమే ఉంటే మరి వారు ప్రపంచాన్ని ఏలిన సమయంలో వారి జనాభా కేవలం 50 లక్షలు కూడా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డాడు.ఇక వారిలో కూడా సోల్జర్స్, సెయిలర్స్ అంటూ వారిని కలిగిన కూడా 50 వేలు కూడా ఉండరు.

వాళ్ళ కంటే మన దేశం జనాభా 13 రేట్లు పెద్దది అని అయినా కూడా వాళ్ళు వచ్చి మన దేశాన్ని ఎలా ఆక్రమించారో అందుకు కారణం కసి అని తెలిపాడు.

ఇకపోతే భారతీయుల గురించి మాట్లాడుతూ.

మనవారు హిమాలయాలకి అవతల ఏ విధమైన ప్రాంతం ఉందో చూడడానికి ఇష్టపడరని, అలాగే సరదాగా కూడా భారతదేశాన్ని దాటి చూడటానికి కూడా వదిలి వెళ్లరని మనం నూతిలో కప్పలలాగా జీవిస్తున్నామని తెలిపాడు.అయితే అతి తక్కువ జనాభా ఉన్న ఓ చిన్న దేశం ఏకంగా ప్రపంచంలో రవి అస్తమించని దేశం గా పేరు తెచ్చుకుంది.

బ్రిటన్ అప్పట్లో కేవలం ఇరవై రెండు దేశాల తప్పించి మిగతా అన్ని దేశాల్లోనూ వారి జెండా మోపింది.ప్రపంచవ్యాప్తంగా వారు వేసుకునే షర్టు, ప్యాంటు వేసుకునే విదంగా అలవాటు చేసారని.

అలాగే వారు మాట్లాడే ఇంగ్లీషు కూడా అందరికీ నేర్పించినట్లు తెలిపాడు.

ఇక చివరగా బ్రిటిష్ దేశస్థులు దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది కేవలం పాలన మాత్రమే అంటూ తెలిపారు.

ప్రపంచంలో ఏకంగా వంద దేశాలను వారు పాలించారు అంటే వారి దగ్గర ఎంత క్రమశిక్షణ ఉందో ఆలోచించాలని తెలిపాడు.బ్రిటిష్ పాలన అనగా ఓ సంస్థ లాగా, అందుకే వాళ్ల దగ్గర నుంచి ఎన్నో నేర్చుకోవాలని తెలిపాడు.

కేవలం అప్పట్లో 50 వేల జనాభా ఉన్న దేశం ప్రపంచాన్ని చేతిలోకి తీసుకుని పాలించింది అంటూ తెలిపాడు.ఇకపోతే బ్రిటిష్ వారు భారతదేశం నుండి తిరిగి వెళ్ళే సమయానికి పది వేల మంది ఆంగ్లేయులు భారత దేశంలో మిగిలిపోయారని అందులో రెండు వేల మంది మళ్ళీ తిరిగి లండన్ కి వెళ్ళిపోయారు అని చెప్పగా.

ఇక మిగిలిన వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు.ఇప్పుడు వాళ్ళ జనాభా ఏకంగా లక్షా పాతిక వేలకు చేరుకుంది వాళ్లే ఆంగ్లో ఇండియన్స్ గా పిలువబడుతునట్లు తెలిపాడు.

దీనితో బ్రిటిష్ వాళ్ళ పై పూరి జగన్నాథ్ తన విశ్లేషణను పూర్తి చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube