ఏ హీరోకు ఎం చెప్తే వెంటనే కాల్షీట్ ఇస్తారో చెప్పిన పూరీ..

కరోనా తర్వాత మరింత వేగంగా ముందుకు సాగుతోంది తెలుగు సినిమా పరిశ్రమ.అందరు హీరోలు వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.

 Puri Revealed Tollywood Heros Secrets Details, Puri, Director Puri Jagannath, He-TeluguStop.com

తీరిక లేనంత బిజీగా సినిమాలు చేస్తున్నారు.కరోనా మూలంగా ఆయా సినిమాల షూటింగ్, రిలీజ్ వాయిదా పడింది.

కానీ.పరిస్థితులు బాగుంటే ఇప్పటికే పలు సినిమాలు జనాల ముందుకు వచ్చేవి.

బాగా అలరించేవి.అయితే ఒకప్పుడు టాప్ హీరోలతో సినిమా అంటే కనీసం రెండు సంవత్సరాలు వేచి చూడాల్సి ఉండేది.

అదే సమయంలో సినిమాపై ఒక్కో హీరోకు ఒక్కో భిన్నమైన ఆలోచన ఉండేది.హిట్ ఫార్ములా ఒక్కటే కాదు.

తమ అభిరుచి మేరకు సినిమాలు చేస్తుంటారు.అయితే ఎవరికి ఏం చెప్తే కాల్ షీట్లు ఇస్తారు అని దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించారు.

ఈ విషయాలు చెప్తే తప్పకుండా ఓకే అంటారని అన్నాడు.ఇంతకీ ఆయన ఎవరి గురించి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సినిమా పరిశ్రమలో వాస్తవానికి ఓ జోక్ ఉందని మొదలుపెట్టాడు పూరీ జగన్నాథ్.ఈ సినిమాలో అన్నీ గన్సే ఉంటాయి.

విలన్‌ పెద్ద గన్‌ డీలర్‌.ఇష్టం వచ్చినట్లు కాల్చుకోవచ్చు అంటే పవన్ కల్యాణ్ కచ్చితంగా డేట్లు ఇస్తారని చెప్పాడు.

ఈ సినిమా అసలు అవుట్‌ డోర్‌ లో షూటింగ్ జరగదు.మొత్తం ఇండోర్ సెట్ లోనే తీస్తున్నాం అంటే చాలు ప్రభాస్ ఓకే చెప్తాడని చెప్పాడు.

అటు ఈ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొడతాం.అంటే కుమ్మేద్దాం భయ్యా అంటూ ఎన్టీఆర్ ఓకే చెప్తాడని చెప్పాడు.

Telugu Puri Jagannath, Heros Sheets, Mahesh Babu, Pawan Kalyan, Prabhas, Puri, P

ఈ రోజు సినిమా షూటింగ్ మొదలు పెడితే.30 రోజుల్లో సినిమా కంప్లీట్ అవుతుంది అని చెప్తే.రవితేజ సంబురపడి డేట్స్ ఇస్తాడని వెల్లడించాడు పూరీ.రేపు సినిమా మొదలువుతుంది.ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చెప్పలేం అంటే మహేష్ సరే అంటాడని వెల్లడించాడు.ఇది కేవలం ఇండస్ట్రీలో ఉన్న టాక్ మాత్రమేనని వెల్లడించాడు.

ఓ సినిమా ఫంక్షన్ లో ఈ విషయాన్ని పూరీ చెప్పడంతో అక్కడే ఉన్న మహేష్​ బాబు, నమ్రత పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube