దసరా తర్వాత బ్యాంకాక్ లో ఫైటర్ స్టార్ట్ చేయబోతున్న పూరి  

Puri plan to start fighter shooting after dasara festival, Tollywood, Bollywood, Ananya Panday, Vijay Devarakonda, Charmi, Karan Johar - Telugu Ananya Panday, Bollywood, Charmi, Dasara Festival, Fighter Movie, Karan Johar, Puri Jagannadh, Tollywood, Vijay Devarakonda

ఇస్మార్ట్ శంకర్ తో జోరు మీద ఉన్న పూరి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా స్టార్ట్ చేశాడు.తరువాత ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించడానికి రెడీ కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కాస్తా లేట్ అయ్యింది.

TeluguStop.com - Puri Plan To Start Fighter Shooting After Dasara Festival

తరువాత ముంబైలో నలభై రోజుల పాటు ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ చేశారు.ఆ తరువాత మరల షూటింగ్ కి రెడీ అయ్యే సమయంలో లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.

మరల ఇప్పుడు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.అయితే ముందుగా పూరి ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.

TeluguStop.com - దసరా తర్వాత బ్యాంకాక్ లో ఫైటర్ స్టార్ట్ చేయబోతున్న పూరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కానీ అక్కడ కరోనా పరిస్థితి కాస్తా ప్రమాదకరంగా ఉండటంతో జాగ్రత్తలు తీసుకున్న వచ్చే ప్రమాదం ఉందని ముంబై షెడ్యూల్ లో హోల్డ్ లో పెట్టారు.

ఇప్పుడు బ్యాంకాక్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది.

యూరప్ హాలిడేకి వెళ్లి విజయ్ దేవరకొండ కూడా తిరిగి వచ్చేయడంతో షెడ్యూల్ ఖరారు చేసే పనిలో పూరి టీం ఉంది.దసరా వెళ్లిన వెంటనే గాని లేదంటే వచ్చే నెల మొదటి వారంలో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు.

ఇక ఈ షెడ్యూల్ లో మెజారిటీ షూటింగ్ ఫినిష్ చేసి చివర్లో ముంబై షెడ్యూల్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు.

అలాగే బాలీవుడ్ హీరోయిన్ అనన్యా పాండే ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.ఇందులో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ గా కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది.బాక్సింగ్ కథకి పూరి మార్క్ మాఫియాని జోడించి ఈ కథని సిద్ధం చేసాడని టాక్ నడుస్తుంది.

#Karan Johar #Puri Jagannadh #Ananya Panday #Charmi #Dasara Festival

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Plan To Start Fighter Shooting After Dasara Festival Related Telugu News,Photos/Pics,Images..