పూరి ప్రేమకథ కోసం నాగ శౌర్య

యంగ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఇప్పటికే తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న శౌర్య ప్రస్తుతం కమర్షియల్ హీరోగా ఎలివేట్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.

 Puri Plan To Love Story Movie With Naga Shourya, Tollywood, Liger Movie, Vijay D-TeluguStop.com

అందులో భాగంగానే ఏకంగా కండలు పెంచేసి విలువిద్య నేపధ్యంలో లక్ష్య సినిమా చేశాడు.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతుంది.

మరో వైపు తనకి అలవాటైన లవర్ బాయ్ తరహా కథలు కూడా చేస్తున్నాడు.వరుడు కావలెను అనే సినిమా కూడా శౌర్య నుంచి రాబోతుంది.

వీటితో పాటు గీతా ఆర్ట్స్ 2 లో కొత్త సినిమాకి నాగ శౌర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.అలాగే హోం బ్యానర్ లో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.ఇలా రిలీజ్ కి రెడీ, షూట్ కి రెండు సినిమాలు శౌర్య చేతిలో ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమా తర్వాత సింపుల్ లవ్ స్టొరీని తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ ప్రేమ కథ కోసం నాగశౌర్యని తీసుకోవాలని అనుకుంటున్నట్లు బోగట్టా.అయితే ఈ సారి ఈ సినిమా బాద్యతలు వేరొకరికి అప్పగించగుండా తక్కువ బడ్జెట్ లోనే తానే తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

లైగర్ షూట్ కంప్లీట్ అయిన తర్వాత శౌర్యతో సినిమాని సెట్స్ పైకి వెంటనే తీసుకెళ్ళి వీలైనంత వేగంగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది.తాను ఎంతగానో ఇష్టపడి రాసుకున్న ప్రేమ కథ కావడంతో ఆ ఎమోషన్ ని ఎలివేట్ చేయాలంటే తానె దర్శకత్వం వహించాలని పూరి భావించినట్లు బోగట్టా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube