మహేష్ పైన పూరీకి ఇంకా కోపమా.. ఎప్పుడికి తగ్గుతుందో మరి!

టాలీవుడ్ స్టార్ నటులలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు.ఈయనకు ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చూపించాల్సిన అవసరం లేదు.

 Puri Maintains Pin Drop Silence On Mahesh Babu Birthday Details, Mahesh Babu, Mahesh Babu Birthday, Puri Jagannadh, Pokiri, Puri Jagannath Mahesh Babu, Okkadu Movie, Business Man Movie, Puri Mahesh Issue, Pokiri Re Relesase-TeluguStop.com

మహేష్ కు ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు.ఎవర్ గ్రీన్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మొన్న పుట్టిన రోజు జరుపు కున్నారు.

ఈ సందర్భంగా సినీ ప్రముఖులతో పాటు ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో సందడి చేసారు.
అలాగే

 Puri Maintains Pin Drop Silence On Mahesh Babu Birthday Details, Mahesh Babu, Mahesh Babu Birthday, Puri Jagannadh, Pokiri, Puri Jagannath Mahesh Babu, Okkadu Movie, Business Man Movie, Puri Mahesh Issue, Pokiri Re Relesase-మహేష్ పైన పూరీకి ఇంకా కోపమా.. ఎప్పుడికి తగ్గుతుందో మరి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈయన పుట్టిన రోజు కానుకగా ఫ్యాన్స్ కోసం మహేష్ బ్లాక్ బస్టర్ సినిమాలైనా పోకిరి, ఒక్కడు సినిమాలను మళ్ళీ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ రోజంతా సూపర్ స్టార్ మ్యానియా అంటే ఏంటో చూపించారు.

పోకిరి సినిమాకు ముందు నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.ఇక్కడ మాత్రమే కాదు ఓవర్సీస్ లో కూడా కలిసి మొత్తం 400 స్పెషల్ షోలను ప్రదర్శించారు.ఇప్పటి వరకు ఇది ఎవ్వరికి సాధ్యం అవ్వలేదు.

అయితే పోకిరి చుట్టూ ఇంత సందడి జరిగిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నా ఈ సినిమా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాత్రం పోకిరి స్పెషల్ షో గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.

ఈ సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయకపోవడం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి.పూరీ జగన్నాథ్ కు మహేష్ తో విభేదాలు ఉన్నాయని ఇంకా పాత విషయాలను ఆయన మర్చిపోలేదని అందుకే ఈయన ఈ వేడుకలను పట్టించు కోలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు.

Telugu Mahesh Babu, Okkadu, Pokiri, Puri Jagannadh, Puri Mahesh-Movie

పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు రాగా రెండు కూడా సూపర్ హిట్ అయ్యాయి.అందులో ఒకటి పోకిరి సినిమా కాగా మరొకటి బిజినెస్ మ్యాన్.ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డులను తిరగరాసాయి.అయితే ఈ సినిమా తర్వాత ముచ్చటగా మూడవసారి జనగణమన సినిమా చేయాలని అనుకున్నారు కానీ ఈ ప్రాజెక్ట్ ఈ కాంబోలో సెట్ అవ్వలేదు.

అలాగే వీరి మధ్య కూడా దూరం పెరిగింది.

Telugu Mahesh Babu, Okkadu, Pokiri, Puri Jagannadh, Puri Mahesh-Movie

ఆ తర్వాత మహేష్ గురించి పూరీ చేసిన కామెంట్స్ వల్ల వీరి మధ్య మరింత దూరం రావడంతో ఈ కాంబో మరోసారి వస్తుంది అనుకున్న వారంతా ఆశలు వదులుకున్నారు.కానీ మహేష్ మాత్రం తన ఫేవరేట్ డైరెక్టర్ పూరీ అని చెప్పడమే కాకుండా కథ చెప్పడానికి ఎప్పుడు వస్తాడా అని చూస్తున్నా అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నాడు.ఈ కామెంట్స్ ను పూరీ ఏ మాత్రం పట్టించుకోలేనట్టు అనిపిస్తుంది.

అలాగే మహేష్ బర్త్ డే సందర్భంగా ఒక్క విష్ కూడా చెప్పలేదని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరి ఈయన కోపం ఎప్పుడుకి తగ్గుతుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube