డార్లింగ్‌ అంటూ ప్రభాస్‌కు వల వేస్తున్న పూరి  

Puri Jaganth Want To Direct Prabhas - Telugu Bujji Gadu, Fighter. Vijay Devarakonda, I Smart Shanker, Puri Jaganth

ఒకప్పుడు ఈయన చుట్టు స్టార్‌ హీరోలు తిరిగేవారు, కాని పరిస్థితులు తల కిందులు అయ్యి హీరోల చుట్టు ఈయన తిరిగే పరిస్థితి వచ్చింది.దాదాపు నాలుగు అయిదు సంవత్సరాల పాటు ఈ దర్శకుడు మరీ దారుణమైన ఫలితాలను చవిచూశాడు.

Puri Jaganth Want To Direct Prabhas

ఇప్పటికే ఆ దర్శకుడు ఎవరో అర్థం అయ్యి ఉంటుంది.అదేనండి మన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాధ్‌.

కమర్షియల్‌ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే పూరి జగన్నాధ్‌ ఎట్టకేలకు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.దాంతో ఈయన మళ్లీ తన ఉనికి చాటుకున్నాడు.

డార్లింగ్‌ అంటూ ప్రభాస్‌కు వల వేస్తున్న పూరి-Movie-Telugu Tollywood Photo Image

  ఇస్మార్ట్‌ మూవీ తర్వాత ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో ‘ఫైటర్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు.ఫైటర్‌ చిత్రం మాఫియా నేపథ్యంలో ఉంటుందని, మాఫియా డాన్‌ కొడుకు పాత్రలో విజయ్‌ దేవరకొండ కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను త్వరలోనే పట్టాలెక్కించబోతున్నాడు.ఇక మరో వైపు దర్శకుడు పూరి తన తదుపరి చిత్రాల విషయంలో కూడా ఇప్పటి నుండే చర్చలు మొదలు పెట్టినట్లుగా సమాచారం అందుతోంది.

గతంలో ప్రభాస్‌తో బుజ్జిగాడు అనే చిత్రాన్ని తెరకెక్కించిన పూరి మరోసారి పూరితో వర్క్‌ చేయాలని కోరుకుంటున్నాడు.

  ప్రభాస్‌ ఇటీవలే సాహో చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు.ఆ చిత్రం ఫ్లాప్‌ అవ్వడంతో తన తదుపరి చిత్రం రాధాకృష్ణ దర్శకత్వంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని మరీ చేస్తున్నాడు.ఆ తర్వాత కూడా పలు చిత్రాలకు ప్రభాస్‌ కమిట్‌ అయినట్లుగా వార్తలు వచ్చాయి.

అయినా కూడా ప్రభాస్‌తో మూవీ కోసం పూరి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవల రెండు మూడు సార్లు స్టోరీ లైన్‌ను ప్రభాస్‌కు పూరి మెసేజ్‌ పెట్టడంతో పాటు, కథ వినిపించాలి అంటూ టైం కోరినట్లుగా కూడా సమాచారం అందుతోంది.

మరి ప్రభాస్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడు అనేది చూడాలి.

#I Smart Shanker #Puri Jaganth #Bujji Gadu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jaganth Want To Direct Prabhas Related Telugu News,Photos/Pics,Images..