రవితేజ సినిమాకు రౌడీతో సీక్వెల్‌ చేస్తున్న పూరి?  

Puri Jaganth Fighter Movie Sequel In Amma Nanna Tamila Ammayi-vijay Devarakonda

విజయ్‌ దేవరకొండ మరియు పూరి జగన్నాధ్‌ల కాంబినేషన్‌లో సినిమా ప్రకటన వచ్చింది.వీరిద్దరి కాంబో మూవీ గురించి ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.పూరి తాజాగా విజయ్‌ దేవరకొండ కోసం ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను రిజిస్ట్రర్‌ చేయించాడు.భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి కావచ్చింది.ప్రస్తుతం క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో చేస్తున్న విజయ్‌ ఆ తర్వాత పూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

Puri Jaganth Fighter Movie Sequel In Amma Nanna Tamila Ammayi-vijay Devarakonda-Puri Jaganth Fighter Movie Sequel In Amma Nanna Tamila Ammayi-Vijay Devarakonda

Puri Jaganth Fighter Movie Sequel In Amma Nanna Tamila Ammayi-vijay Devarakonda-Puri Jaganth Fighter Movie Sequel In Amma Nanna Tamila Ammayi-Vijay Devarakonda

ఇక వీరిద్దరి కాంబోలో రూపొందబోతున్న ‘ఫైటర్‌’ చిత్రం కథ గురించి కుప్పలు తెప్పలుగా చర్చలు జరుగుతున్నాయి.గతంలో పూరి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రం కథకు సీక్వెల్‌ అన్నట్లుగా ఉంటుందని, ఆ సినిమా కథను పొడిగిస్తే ఎలా ఉంటుందో ‘ఫైటర్‌’ కథ కూడా అలాగే ఉంటుందని అంటున్నారు.అయితే ఇది అఫిషియల్‌గా సీక్వెల్‌ మాత్రం కాదని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

రవితేజ కెరీర్‌లో ఆ సినిమా ఒక బ్లాక్‌ బస్టర్‌.అందుకే ఆ సినిమా కథను బేస్‌ చేసుకుని విజయ్‌ దేవరకొండ కోసం పూరి జగన్నాధ్‌ కథను సిద్దం చేశాడు.

అది కాస్త సీక్వెల్‌ రూపంలో వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే విజయ్‌ దేవరకొండకు స్టోరీ లైన్‌ నచ్చింది.త్వరలోనే వీరిద్దరి కాంబో మూవీ పట్టాలెక్కబోతుంది.ప్రస్తుతం పూరి ఫ్యామిలీతో బ్యాంకాక్‌లో హాలీడేస్‌లో ఉన్నాడు.అక్కడ నుండి వచ్చిన తర్వాత సినిమాను పట్టాలెక్కించనున్నారు.మరి డియర్‌ కామ్రేడ్‌ చిత్రంతో నిరాశ పర్చిన విజయ్‌ దేవరకొండ ఫైటర్‌గా మెప్పిస్తాడేమో చూడాలి.