రాజకీయ నాయకులంతా రైతుల్లా మారాలంటున్న పూరి జగన్నాథ్...!

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎంతోమంది టాలీవుడ్ టాప్ హీరోలకు వారి కెరియర్ మొదట్లో అనేక హిట్ సినిమాలను ఇచ్చి వారిని ఓ స్థాయిలో నిలబెట్టాడు.

 Vegatables, Puri Jaganath, Vertical Froming, Farmers,-TeluguStop.com

ఇకపోతే కరోనా వైరస్ నేపథ్యంలో వచ్చిన లాక్ డౌన్ నేపథ్యంలో ఆయన సినిమాలకు విరామం ఇచ్చాడు.అయితే ఆ సమయంలో పూరీ మ్యూజింగ్స్ అనే పేరుతో వివిధ అంశాలపై తనకు తోచిన విధంగా ఆయన అభిప్రాయాలను తెలుగు ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు.

ఇప్పటి వరకు చాలా విషయాల గురించి ఆయన సోషల్ మీడియాలో మాట్లాడారు.

ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా ఆయన వర్టికల్ ఫార్మింగ్ గురించి ఆసక్తికరమైన కామెంట్లను చేశాడు.

మనుషులు అనేక సంవత్సరాల క్రితమే వ్యవసాయం నేర్చుకున్నాడు అని, ఎన్నో పద్ధతులు, విధానాలలో పంటలు పండిస్తున్నట్లు తెలుపుతూనే ప్రస్తుతం అనేక లేటెస్ట్ పద్ధతులలో ఒకటైన వర్టికల్ ఫార్మింగ్ గురించి ఆయన తెలియజేశాడు.ఇకపోతే రోజువారి కూరగాయలను మనమే ఇంట్లోనే పెంచు కోవచ్చు అన్న విషయంపై ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వివరించాడు.

Telugu @purijagan, Farmers, Puri Jaganath, Vegatables, Vertical-Latest News - Te

ఇందులో భాగంగానే కూరగాయలను పండించడానికి ఎకరాలకు ఎకరాలు భూమి అవసరం లేదని ఎవరి ఇంటి టెర్రస్ మీద వారు కూరగాయలను పండించుకోవచ్చు అంటూ వాటి వివరాలను తెలిపాడు.ఇందుకోసం ప్రతి ఒక్కరు వ్యవసాయం మీద దృష్టి సారించాలని.తమ వంట గది పక్కనే స్వయంగా కూరగాయలు పండించుకోవాలి అంటూ దర్శకుడు పూరి జగన్నాధ్ చెప్పుకొచ్చారు.ఇకపోతే బయటి పొలంలో భూమి తడవడానికి కొన్ని వేల లీటర్ల నీరు అవసరం వస్తే ఇంట్లో పెంచే వర్టికల్ ఫార్మింగ్ కోసం పదుల సంఖ్య లీటర్ల లలో నీరు అవసరం పడుతుందని చెప్పుకొచ్చాడు.

అంతేకాదు పొలంలో లాగా పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు.ఇలా ఎకరాలలో పండించే కూరగాయలు కేవలం గజాలలో ఉండి పెంచవచ్చని చెబుతూనే ఇలా పండించిన కూరగాయలు తినడం ద్వారా మనకు రసాయనాలు లేని కూరగాయలు లభిస్తాయని, అలాగే ఆరోగ్యకరంగా ఉంటామని చెప్పుకొచ్చాడు.

ఈ సంగతిని దృష్టిలో ఉంచుకొని వర్టికల్ ఫార్మింగ్ పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ప్రతి గ్రామంలో కూడా వర్టికల్ ఫార్మింగ్ ప్రోత్సహించాలి అంటూ ఆయన కోరారు.అంతేకాదు ప్రజాప్రతినిధులందరూ కూడా తలపాగా చుట్టుకొని రైతన్నల మారాలంటూ పూరి జగన్నాథ్ తెలిపాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube