విజయ్ లో ఆ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం : పూరీ

సెన్సేషనల్ హీరోగా అంతకంతకు ఎదుగుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగి పోతుంది.

 Puri Jagannath Speech At Liger Fandom Tour In Warangal , Vijay Deverakonda, Ananya Panday, Liger Team ,puri Jagannath, Liger Fandom Tour, Warangal-TeluguStop.com

ప్రెసెంట్ విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాతో మరొక నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధం అవుతున్నాడు.ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

రిలీజ్ కు దగ్గర పడడంతో మేకర్స్ ప్రొమోషన్స్ లో స్పీడ్ పెంచుతున్నారు.ఇప్పటికే విజయ్ ముంబై లో పలు ఏరియాల్లో ప్రొమోషన్స్ చేయగా అక్కడి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

అందుకే ఫ్యాన్ డమ్ టూర్ పేరుతో దేశం మొత్తం విజయ్ టూర్ వేస్తున్నారు.ఈ నేపథ్యంలో తాజాగా వరంగల్ లో ఈ జరిగింది.

ఇక్కడ పూరీ మాట్లాడుతూ.వర్షంలో కూడా తడుస్తూ ఇక్కడ చాలా థాంక్స్.

లవ్ యు ఆల్.అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ చుసిన తర్వాత అతడితో సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాను.నాకు విజయ్ లో అతడి నిజాయితీ అంటే చాలా ఇష్టం.బయటే కాదు.యాక్టింగ్ లో కూడా చాలా నిజాయితీ గా ఉంటాడు.అతడి మాటల్లో కూడా నిజాయితీ ఉంటుంది.

ఒక నిర్మాతగా లైగర్ సినిమా చేస్తున్న సమయంలో అతడికి 2 కోట్లు పంపాను.ఆ తర్వాత నాకు అప్పు ఉందని తెలిసి ఆ 2 కోట్లు ఇచ్చి ముందు ఆ అప్పు తీర్చు అని చెప్పాడు.

ఈ రోజుల్లో తీసుకున్న డబ్బు ఎవరు తిరిగి ఇస్తారండి.కానీ విజయ్ పంపాడు.తాను నన్ను వాళ్ళ డాడీలాగా భావిస్తాడు.ఇతడి లాంటి హీరోను నేను ఇంత వరకు చూడలేదు అంటూ విజయ్ ను పొగిడాడు పూరీ జగన్నాథ్.

Telugu Ananya Panday, Liger Fandom, Liger, Puri Jagannath, Purijagannath, Warangal-Movie

ఇక ఈ టూర్ ఆగష్టు 11న పూణే లో స్టార్ట్ చేయగా.ఆగష్టు 23న వారణాసి లో ఎండ్ చేయబోతున్నారు.ఇలా ఇండియా మొత్తం కవర్ చేసేలా విజయ్ టీమ్ ప్రొమోషన్స్ చేయనున్నారు.మరి గట్టి ప్లాన్ తోనే రాబోతున్నారు కాబట్టి ఓపెనింగ్స్ గట్టిగానే రాబట్టేలాగానే ఉన్నారు.ఈ సినిమాలో లైగర్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది.హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమాను పూరీ కనెక్ట్స్ ఇంకా ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube