నేను చాలా రొమాంటిక్ అంటున్న పూరీ తనయుడు!  

టాలీవుడ్ స్టార్ దర్శకుడు తనకంటూ ప్రత్యెక గుర్తింపు సొంతం చేసుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన కొడుకుని కూడా తన వారసుడుగా స్టార్ హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఇప్పటికే కొడుకుతో మెహబూబా అనే సినిమాని తన స్టైల్ కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కించాడు. అయితే సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. కాని హీరోగా ఆకాష్ పూరీగా మంచి మార్పులే పడ్డాయి. ఇక కొడుకుకి సక్సెస్ ఇవ్వాలనే కసితో వున్నా పూరీ జగన్నాథ్ ఆకాష్ తో రెండో సినిమాకి కూడా రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాకి తాను కేవలం కథ, మాటలు, స్క్రీన్ ప్లే మాత్రమె అందిస్తూ తన శిష్యుడు అనిల్ ని దర్శకుడుగా పరిచయం చేస్తున్నాడు. దీనిని కూడా తన సొంత బ్యానర్ లోనే తెరకేక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమాని తన స్టైల్ లో భారీ బడ్జెట్ మూవీగా కాకుండా తక్కువ బడ్జెట్ తో ఆకాష్ ని సరిపోయే కథని రెడీ చేసి రొమాంటిక్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సినిమాని పూరీ జగన్నాథ్ తన పూరీ కనెక్ట్స్ లోనే తెరకేక్కిస్తున్నాడు. మరి ఈ సినిమాతో అయిన కొడుకు ఆకాష్ నిర్మాతగాగా రచయితగా సాలిడ్ హిట్ ని పూరీ ఇస్తాడేమో చూడాలి.