ఇస్మార్ట్ శంకర్ సినిమాకు ముందు పూరీకి అలాంటి పరిస్థితా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలను తెరకెక్కించడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను అందుకుంటున్న అతికొద్ది మంది దర్శకులలో పూరీ జగన్నాథ్ ఒకరు.ఒక్కో సినిమాకు పూరీ జగన్నాథ్ 10 నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.

 Puri Jagannath Situation Changed With Ismart Shankar Movie Details Here  , Puri-TeluguStop.com

పలు సినిమాలకు పూరీ జగన్నాథ్ నిర్మాతగా కూడా వ్యవహరించడం గమనార్హం.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన లైగర్ సినిమాకు పని చేసిన యాక్టర్ విశు రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు మొదట సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలియదని అన్నారు.

బ్యాగ్రౌండ్ లేదని ఇంట్లో కూడా నాకు సినిమాలలో ప్రోత్సాహం లేదని ఆయన తెలిపారు.నాకు డిపెండ్ కావడం ఇష్టం ఉండదని విశు రెడ్డి తెలిపారు.

మనల్ని మనం అప్ గ్రేడ్ చేసుకోవడం కూడా ముఖ్యమని ఆయన తెలిపారు.జోష్ సినిమా సమయంలో నా వయస్సు 19, 20 అని ఆయన తెలిపారు.

పని చేస్తూ అడిషన్స్ ఇచ్చానని విషు రెడ్డి తెలిపారు.ఎంత బుక్ నాలెడ్జ్ ఉన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండటం ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు.

పక్కోడి జోలికి నేను వెళ్లనని విశు రెడ్డి అన్నారు.నా వల్ల హెల్ప్ అయితే చేస్తానని కాదంటే కాదని చెబుతానని విశు రెడ్డి పేర్కొన్నారు.

పక్కోడు క్లాస్ పీకేంత వరకు నేను తెచ్చుకోనని ఆయన అన్నారు.పూరీ జగన్నాథ్ గారు నాకు గురువు అని ఆయన తెలిపారు.

మెహబూబా టైమ్ లో ఆకాశ్ కు ఈక్వల్ గా నన్ను పూరీగారు ప్రమోట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు.మెహబూబా సినిమా సమయానికి కూడా పూరీ జగన్నాథ్ కు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఆయన తెలిపారు.

Telugu Ismart Shankar, Nabha Natesh, Nidhi Agrawal, Puri Jagannath, Ram Pothinen

పూరీ జగన్నాథ్ ఆ సమయంలో మేనేజ్ చేసుకుంటూ వచ్చారని ఆయన తెలిపారు.ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ కావడంతో ఆయన పరిస్థితి మారిపోయిందని ఆ సినిమా విజయం తర్వాత పూరీ జగన్నాథ్ రెండు కార్లు కొన్నారని విశు రెడ్డి అన్నారు.ఎప్పుడూ పూరీ జగన్నాథ్ ఇతరుల మంచిని కోరుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube