ఫ్లాపుల్లో ఉన్న పూరి రేంజ్ అదే..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ ఒకప్పుడు సినిమా తీస్తే హిట్ అన్న పరిస్థితి ఉండేది.కాని పరిస్థితులు మారాయి పూరి సినిమా హిట్ కొట్టి చాలా రోజులయ్యింది.

 Puri Shocking Remuneration For Ism Movie-TeluguStop.com

లాస్ట్ ఇయర్ వచ్చిన టెంపర్ తప్పించి ఆ తర్వాత తీసిన జ్యోతిలక్ష్మి, లోఫర్ పూరి ఇమేజ్ ను పూర్తిగా డ్యామేజ్ చేసేశాయి.హిట్లు కొట్టకున్నా పూరి రేంజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు అదెలా అంటే తను తీసుకునే రెమ్యునరేషన్ విషయంలో పూరి చిల్లిగవ్వ కూడా తగ్గలేదట.

రెగ్యులర్ గా పూరి ఒక్క సినిమాకు 8 కోట్లు డిమాండ్ చేస్తాడట.

ఇక ముందు రెండు ఫ్లాపులున్నా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో చేస్తున్న ఇజం సినిమాకు కూడా పూరి అదే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్.

మరి హిట్ వచ్చినా ఫ్లాపులొచ్చినా పూరి రేంజ్ మాత్రం అలానే ఉందని అనాలి.ఇక ఇజం సినిమా విషయానికొస్తే కళ్యాణ్ రామ్ ను డిఫరెంట్ స్టైల్ లో చూపిస్తున్న పూరి ఇజం ఫస్ట్ లుక్ తోనే అందరిని అవాక్కయ్యేలా చేశాడు.

సగానికి పైగా పూర్తయిన ఈ సినిమా సెప్టెంబర్ లో పూర్తి చేసి దసరా బరిలో దించాలని చూస్తున్నాడు.ఈ మధ్య దర్శకుల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉండటంతో ఎవరికి వారు హిట్ సినిమా తీసి తన సత్తా చాటాలని చూస్తున్నారు.

మరి ఇజంతో పూరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube