రివ్యూలు రాసేవాళ్లపై పూరీ జగన్నాథ్ సంచలన వ్యాఖ్యలు..?

దశాబ్దం క్రితం ఏ సినిమా అయినా బాగుందో బాలేదో తెలుసుకోవడానికి ప్రేక్షకులు మౌత్ టాక్ పై ఆధారపడేవారు.సినిమా చూసిన వాళ్లు చెప్పే అభిప్రాయమే అంతిమంగా సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది.

 Puri Jagannaadh Shocking Comments About Review Writers, Jagannath Movie Review,-TeluguStop.com

అయితే మారుతున్న కాలంతో పాటే ప్రేక్షకులు సినిమా రిజల్ట్ ను తెలుసుకునేందుకు యూట్యూబ్, వెబ్ సైట్లలో రివ్యూలపై ఆధారపడుతున్నారు.ఈ రివ్యూలపై అప్పుడప్పుడూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాకు రివ్యూలు అద్భుతంగా వచ్చి డిజాస్టర్ అయిన సినిమాలు ఉన్నాయి.అదే సమయంలో తక్కువ రేటింగ్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.

అయితే సినిమా ఇండస్ట్రీలో చాలామంది మాత్రం రివ్యూల వల్ల తమ సినిమాలకు నష్టం జరుగుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు.తాజాగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా రివ్యూల గురించి, రివ్యూలు రాసేవాళ్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Telugu Critics, Puri Jagannath, Review Writers-Latest News - Telugu

సినిమా రివ్యూలు, రేటింగులు సినిమా షోలపై ప్రభావం చూపడటంతో పాటు నిర్మాతలను ఇండస్ట్రీకి దూరం చేస్తున్నాయని పూరీ జగన్నాథ్ అన్నారు.కొందరు కనీస అవగాహన లేకుండా రాసే సమీక్షలు నిర్మాతలకు శాపంగా మారుతున్నాయని పేర్కొన్నారు.సినిమా గురించి కొందరు జర్నలిస్టులు చేసే నెగిటివ్ ట్వీట్ల వల్ల దర్శకనిర్మాతలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని .ప్రతి సంవత్సరం 200 సినిమాలు విడుదలైతే అందులో పది సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయని ఆన్నారు.

రివ్యూ రైటర్లు రేటింగ్ విషయంలో సానుకూలంగా ఉండాలని.జర్నలిస్టులపై కూడా సినీ పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత ఉందని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.రివ్యూలు, రేటింగ్ ల వల్ల నిర్మాతలు పడుతున్న కష్టాల గురించి పూరీ జగన్నాథ్ వివరించారు. పూరీ జగన్నాథ్ చెప్పిన మాటల్లో కూడా నిజం ఉందని ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

రివ్యూలు సినిమా ఫలితంపై పెద్దగా ప్రభావం చూపవని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube