పూరి తనయుడు కోసం బాలీవుడ్ భామ!  

తనయుడు కోసం బాలీవుడ్ హీరోయిన్ ని రంగంలోకి దించుతున్న పూరి జగన్నాథ్..

  • స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని ఎలా అయినా టాలీవుడ్ లో కమర్షియల్ హీరోగా నిలబెట్టాలని ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే కొడుకుతో మెహబూబా అనే సినిమాని తెరకెక్కించిన పూరి జగన్నాథ్ తనకి సక్సెస్ మాత్రం ఇవ్వలేకపోయాడు. అయితే ఈసారి కచ్చితంగా ఇటీవలనే కసితో ఉన్న పూరి తన అసోసియేట్ అనిల్ కి దర్శకత్వ బాధ్యతలు అప్పగించి కొడుకుతో రొమాంటిక్ అనే సినిమాని నిర్మిస్తున్నాడు.

  • ఇక ఈ సినిమా కోసం ఆర్టిస్టును ఎందుకు చేస్తున్న పూరి జగన్నాథ్ ఇందులో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ భామ, ఒకప్పటి క్రికెట్ కామెంటేటర్ అయిన మందిరా బేడి ని రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి హీరోయిన్ గా ఢిల్లీ మోడల్ కేతిక శర్మని ఫైనల్ చేసిన పూరి తాజాగా మందిరా బేడిని కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమాకి కేవలం నిర్మాతగానే కాకుండా పూరి జగన్నాథ్ స్టోరీ, డైలాగ్ కూడా అందించడం విశేషం.