తిండి విషయంలో కుండ బద్దలు కొట్టిన పూరి జగన్నాథ్..!

లాక్ డౌన్ సమయం నుంచి సినిమా షూటింగులు తక్కువ అయిన సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ తన సోషల్ మీడియా ద్వారా పూరి మ్యూజింగ్స్ అనే పేరుతో ఎన్నో విషయాలను తనదైన స్టైల్ లో ప్రజలకు వివరిస్తున్నాడు.కొన్ని సార్లు ఆయన మాటలు వింటే జీవితం అంటే ఇదే కదా అన్న భావన మనకు కలుగుతుంది.

 Puri Jagannath, Puri Connects, Instagram, Processing Food, Socialmedia, Fighter-TeluguStop.com

మరికొన్ని వింటే భూమిపై ఇలాంటి విషయాలు కూడా జరుగుతున్నాయా అన్న ఆలోచన మనకు రానే వస్తుంది.మరి కొన్ని విషయాలు వింటే మనం ఎప్పుడు కనివిని ఎరుగని విషయాల గురించి ఆయన చెబుతుంటే చెవులు పక్కకి తిప్పకుండా వినాల్సి వస్తుంది.

ఇందులో భాగంగానే తాజాగా పూరి జగన్నాథ్ ఆహారం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశాడు.ఆహారంపై ప్రజలు తీసుకుంటున్న జాగ్రత్త విషయాలను కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన చెప్పేశాడు.

ఇందులో భాగంగానే కుండ బద్దలు కొట్టినట్టుగా ఆయన కొన్ని విషయాలను తెలియ చేసాడు.మనం రోజు తింటున్న తిండి ఓ చెత్త తిండి అంటూనే.మంచి ఆహారాన్ని మనం పాడుచేసి తింటున్నమని, ఆ పాడైపోయిన ఆహారాన్ని తినడానికి నానా పనులు చేసి తినడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపాడు.ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారు అని ఆయన తెలియజేశారు.

కొన్ని సంవత్సరాల క్రితం మనుషులకు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే ఏంటో తెలియని మనుషులు కాలక్రమేనా ఏది దొరికితే అది ఆహారంగా తీసుకుంటూ జీవించేవారని తెలిపాడు.ఇప్పటి కాలంలో చాలా మంది బద్దకించి వ్యవసాయం చేయడం మొదలు పెట్టారని వ్యవసాయం చేసిన పంటను దాచుకోవడం మొదలుపెట్టారని తెలుపుతూనే పంటను దాచుకోవడం కోసం ముందుగా ఆ ఆహార పదార్థాలను ప్రాసెసింగ్ చేయాలని, అలా ఆహారాన్ని ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే ఆహారంలో ఉన్న పోషక విలువలు పూర్తిగా నశించిపోతాయని తెలిపాడు.

ఎప్పుడైతే మనం ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవటం మొదలు పెడతమో అప్పుడే మన సహజత్వం కోల్పోయిన ఆహారాన్ని తినడం మొదలు పెట్టాము అంటూ దాని ద్వారానే అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.అంతేకాకుండా ఏ ఆహారం అయితే త్వరగా చెడిపోతుందొ ఆ ఆహారం ఆరోగ్యానికి మంచిదని అలాగే జంతికలు, పచ్చళ్లు, అప్పడాలు లాంటివి ఎక్కువ కాలం ఉంటాయని ఆయన చెప్పుకొచ్చాడు.అలా ఎక్కువ కాలం నిలువ ఉన్న ఆహార పదార్థాలు తినడానికి బ్యాక్టీరియా కూడా ఇష్టపడని కానీ, మనం వాటిని ఇష్టంగా తింటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube