ఇస్మార్ట్‌ శంకర్‌ మెప్పిస్తే.. మహేష్‌ జనగణమన పాడేస్తాడట!  

Puri Jagannath Movie With Mahesh After Ismart Shankar-

ఒకప్పుడు స్టార్‌ హీరోలు సైతం పూరి జగన్నాధ్‌కు పిలిచి ఆఫర్లు ఇచ్చే వారు.కాని ప్రస్తుత పరిస్థితి పూర్తి రివర్స్‌.చిన్న హీరోలు సైతం పూరితో సినిమా అంటే కాస్త జంకుతున్నారు.పూరితో మూవీ చేసేందుకు ఏ ఒక్కరు ఆసక్తి చూపడం లేదు.

Puri Jagannath Movie With Mahesh After Ismart Shankar-

చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత రామ్‌ తాజాగా ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాన్ని చేసేందుకు ముందుకు వచ్చాడు.ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్న ఈ చిత్రం ఫలితం పూరి ఫ్యూచర్‌ను డిసైడ్‌ చేయబోతున్నట్లుగా సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.పెద్ద ఎత్తున సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న పూరి జగన్నాధ్‌ ఈ చిత్రాన్ని హిట్‌ చేసి సూపర్‌ స్టార్‌ డేట్స్‌ తీసుకోవాలని ఆరాట పడుతున్నాడు.

ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాను హిట్‌ చేసి మహేష్‌ బాబుతో తాను చాలా కాలంగా అనుకుంటున్న జనగణమన చిత్రాన్ని చేయాలని పూరి భావిస్తున్నాడు.చాలా కాలం క్రితమే కథ ఓకే అయ్యింది, కాని పూరిపై నమ్మకం లేకపోవడంతో మహేష్‌ ఆ సినిమాను వాయిదా వేస్తూ వచ్చాడు.

Puri Jagannath Movie With Mahesh After Ismart Shankar-

ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీ సక్సెస్‌ అయితే మహేష్‌ బాబు తప్పకుండా పూరికి డేట్లు ఇవ్వడం ఖాయం.ఇప్పటికి ఇద్దరి కాంబోలో వచ్చిన పోకిరి మరియు బిజినెస్‌మన్‌ చిత్రాలు మంచి విజయాలను దక్కించుకున్నాయి.

జనగణమన హ్యాట్రిక్‌ ఖాయం అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.కాని మహేష్‌ బాబుకు మాత్రం నమ్మకం కలగడం లేదు.

పూరి జగన్నాధ్‌ మినిమం సక్సెస్‌తో తనముందుకు వచ్చినా కూడా తప్పకుండా ఆయనతో ఉన్న అనుబంధం దృష్ట్యా తప్పకుండా సినిమా చేస్తానని సన్నిహితుల వద్ద మహేష్‌ అన్నట్లుగా తెలుస్తోంది.అందుకే పూరి ఇస్మార్ట్‌ శంకర్‌ మూవీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు.

రామ్‌కు జోడీగా ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ మరియు నభా నటేష్‌లు నటిస్తున్నారు.

.

తాజా వార్తలు

Puri Jagannath Movie With Mahesh After Ismart Shankar- Related....