బద్రి మూవీకి ముందే పూరీ డైరెక్షన్ లో నటించిన ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా...?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి…ఈయన ఇండస్ట్రీ కి వచ్చిన మొదట్లో కృష్ణవంశీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు.అప్పట్లో ఆయన దగ్గర ఉన్న స్టోరీస్ ని పట్టుకొని హీరోలకి చెప్పడానికి తిరుగుతూ ఉండేవాడు.

 Puri Jagannath Movie With Krishna Before Pawan Kalyan Badri Movie Details, Puri-TeluguStop.com

అలా ఒకరోజు సూపర్ స్టార్ కృష్ణ గారికి స్టోరీ చెప్పే అవకాశం వచ్చింది పూరి వెళ్లి ఆయనకి కథ చెప్పగానే ఆ కథ కృష్ణ గారికి బాగా నచ్చింది.దానితో కృష్ణ తో సినిమా చేసే అవకాశం వచ్చింది అలా ఆ సినిమా కి తిల్లనా అనే టైటిల్ కూడా పెట్టాడు పూరి…

అలాగే కొద్ది రోజులు కృష్ణ గారి మీద కొన్ని సీన్లు షూట్ కూడా చేసాడు కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల అనుకోకుండా ఈ సినిమా ఆగిపోయింది.

 Puri Jagannath Movie With Krishna Before Pawan Kalyan Badri Movie Details, Puri-TeluguStop.com

అలా పవన్ కళ్యాణ్ కంటే ముందే పూరి కృష్ణ గారిని డైరెక్ట్ చేశాడు…ఆ తర్వాత పూరి పవన్ కళ్యాణ్ తో బద్రి తీసి సూపర్ డుపర్ హిట్టు కొట్టాడు.పవన్ కళ్యాణ్ లాంటి హీరోతో బద్రి తీయడమే కాకుండా అప్పటివరకు లేని ఒక కొత్త స్టైల్ లో పవన్ కళ్యాణ్ ని చూపించాడు పవన్ కళ్యాణ్ కి ఒక కొత్త మేనరిజమ్స్ అయిన మెడ దగ్గర చేయిపెట్టుకునే ఆ స్టైల్ పూరి సెట్ చేసిందే…

Telugu Badri, Chiranjeevi, Krishna, Pawan Kalyan, Puri Jagannath, Puri Krishna,

ఇప్పటికీ పవన్ కళ్యాణ్ అదే స్టైల్ ఫాలో అవుతున్నాడు ఆయన ఫ్యాన్స్ కి కూడా ఆ స్టైల్ అంటే చాలా ఇష్టం…ఇక బద్రి సినిమా నుంచి వెను తిరిగి చూడకుండా ఇండస్ట్రీ లో తనతో పాటు ఉన్న డైరెక్టర్స్ ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో చాలా తక్కువ టైమ్ లోనే సినిమాలు తీస్తూ టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు…

Telugu Badri, Chiranjeevi, Krishna, Pawan Kalyan, Puri Jagannath, Puri Krishna,

ప్రస్తుతం లైగర్ ప్లాప్ వల్ల కొంచం తగ్గిన పూరి తొందరలోనే మళ్ళీ కొత్త సినిమాతో వచ్చి సందడి చేయబోతున్నారు అని తెలుస్తుంది…అందులో భాగంగా గానే మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం వచ్చినట్టే అనిపించినప్పటికీ దాని మీద ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు.ఇంతకు ముందే చిరంజీవి కం బ్యాక్ మూవీని పూరినే చేయాలి కానీ చిరంజీవి కి పూరి రాసిన ఆటో జాని స్టోరీ సెకండ్ హాఫ్ నచ్చకపోవడంతో అది కార్య రూపం దాల్చలేదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube