అమ్మాయిలు అలా ఆలోచిస్తారంటున్న పూరీ జగన్నాథ్!  

puri jagannath interesting comments on girls Purijaganath, Director, Puri Musings, Ismart Shanker, Lock Down, Mahishmathi Samrajyam, Bahubali - Telugu Bahubali, Director, Ismart Shanker, Lock Down, Mahishmathi Samrajyam, Puri Musings, Purijaganath

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ రూటే సపరేటు.ఇతర స్టార్ డైరెక్టర్లతో పోలిస్తే వేగంగా సినిమాలు తీయాలన్నా, వేగంగా కథలు రాయాలన్నా పూరీకి మాత్రమే సాధ్యం.

TeluguStop.com - Puri Jagannath Interesting Comments On Girls

కరోనా, లాక్ డౌన్ వల్ల ఎప్పుడూ బిజీగా ఉండే పూరీ గత కొన్ని నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు.గతేడాది ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు.

`పూరీ మ్యూజింగ్స్` ద్వారా సోషల్ మీడియాలో మనస్సులోని అభిప్రాయాలను పంచుకుంటున్న పూరీ జగన్నాథ్ అమ్మాయిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.అమ్మాయిలు వాస్తవానికి దూరంగా భ్రమల్లో బ్రతుకుతుంటారని.

TeluguStop.com - అమ్మాయిలు అలా ఆలోచిస్తారంటున్న పూరీ జగన్నాథ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కలల్లో జీవిస్తూ ఉంటారని.చాలా లాజికల్ గా ఆలోచిస్తారని.

బాగా ప్రేమిస్తారని.వాళ్లలో అన్నీ మంచి లక్షణాలే ఉన్నా పొగడ్తలకు పడిపోయే లక్షణం మాత్రం ఉందని చెప్పారు.

ఇతరులు పొగడాలని అమ్మాయిలు ప్రతిక్షణం ఎదురు చూస్తుంటారని అన్నారు.అబ్బాయిలు పక్కింటి అమ్మాయిని ప్రేమించి కలకాలం సంతోషంగా ఉండగలరని.అమ్మాయిలు మాత్రం పక్కింటి అబ్బాయిలని ఊహించుకోరని అన్నారు.ఆరడుగుల ఎత్తు, సిక్స్ ప్యాక్, సినిమా హీరోలా ఉండే వరుడే కావాలని కోరుకుంటారని సిక్స్ ప్యాక్ ఉన్నవాడిని చేసుకున్నా వాడికి ఏదో ఒకరోజు పొట్ట వస్తుందని చెప్పారు.

అమ్మాయిలు ఐటెమ్ గాళ్ గా ప్రదర్శించడం ఆపాలని.స్టైల్ ను పక్కన పెట్టి సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకోవాలని.శక్తివంతమైన మహిళగా ఎదిగేందుకు ప్రయత్నించాలని.తన పని తాను చేసుకునే మంచివాడిని పెళ్లి చేసుకోవాలని అన్నారు.

బాహుబలి కావాలని.మాహిష్మతి సామ్రాజ్యం కావాలని కోరుకోవద్దని.

వాస్తవానికి దగ్గరగా బ్రతకాలని సూచించారు. పూరీ చేసిన ఈ కామెంట్లపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొందరు పూరీ కామెంట్లను సమర్థిస్తుంటే మరి కొందరు పూరీ వ్యాఖ్యల్లో వాస్తవం లేదంటున్నారు.

View this post on Instagram

‪👉 https://youtu.be/KobZddH77mA @charmmekaur #PC

A post shared by Puri Connects (@puriconnects) on

#Bahubali #Lock Down #Ismart Shanker #Puri Musings #Purijaganath

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Puri Jagannath Interesting Comments On Girls Related Telugu News,Photos/Pics,Images..