వాళ్లే నిజమైన అందగత్తెలు అంటున్న పూరీ జగన్నాథ్..?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ గత కొన్ని నెలల నుంచి ఎన్నో విషయాల గురించి మాట్లాడుతూ పూరీ మ్యూజింగ్స్ ద్వారా వీడియోలు, ఆడియోల రూపంలో అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే.ఏ విషయాన్నైనా సూటిగా యువత ఆలోచనలకు అనుగుణంగా పూరీజగన్నాథ్ చెబుతూ ఉండటంతో ఆయన మాటలు యూత్ ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.

 Puri Jagannath Interesting Comments About Tom Boys-TeluguStop.com

తాజాగా పూరీ టామ్ బాయ్ అనే అంశం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అమ్మాయి అయినా అబ్బాయిలా ప్రవర్తించే వాళ్లను టామ్ బాయ్ అని అంటారని.

వీళ్లు ప్రతి రంగంలోనూ అబ్బాయిలకు గట్టి పోటీని ఇస్తూ ఉంటారని చెప్పారు.అమ్మాయిలలో కొంతమంది మాత్రమే ఈ విధంగా ఉంటారని.

 Puri Jagannath Interesting Comments About Tom Boys-వాళ్లే నిజమైన అందగత్తెలు అంటున్న పూరీ జగన్నాథ్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వీళ్లు సిగ్గు పడకుండా దురుసుగా దూసుకెళ్లిపోతూ ఉంటారని తెలిపారు.నచ్చిన విధంగా బ్రతుకుతూ ఏ విషయంలోనైనా ప్రాక్టికల్ గా థింక్ చేస్తూ మనసులో ఉన్న మాటలను మొహమాటపడకుండా ముఖంపై చెప్పేస్తూ ఉంటారని అన్నారు.

బట్టల విషయంలో అబ్బాయిలలానే ఉంటారని.ఎవరినో అట్రాక్ట్ చేసేలా డ్రెస్సుల విషయంలో వ్యవహరించరని పేర్కొన్నారు.మేకప్ కు అస్సలు ప్రాధాన్యత ఇవ్వరని.గంటల తరబడి అద్దం ముందు కూర్చోరని.అబ్బాయిల కంటే ఇలా పెరిగిన అమ్మాయిలే బూతులు బాగా తిట్టగలరని చెప్పారు.వీళ్లు సౌకర్యవంతంగా ఉండే బట్టలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.

అలాంటి అమ్మాయిలనే తాను ఎంతో ఇష్టపడతానని వీళ్ల వల్లే ప్రపంచం మారుతోందని పూరీ చెప్పారు.ఇలాంటి అమ్మాయిలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తారని. బిజినెస్ చేసి ఉన్నత స్థానాలకు ఎదగాలని అనుకుంటారని పేర్కొన్నారు, అలాంటి కూతుళ్లు ఉన్న తల్లిదండ్రులు కంగారు పడవద్దని వాళ్లే సమాజంలో నిజమైన అందగత్తెలు అని పూరీ జగన్నాథ్ తెలిపారు.రియల్ ఉమెన్ ఆల్ వేస్ ఏ టామ్ బాయ్ అని చెప్పారు.

పూరీ మాటలను నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసిస్తున్నారు.

#Tom Boy Secrets #DirectorPuri #Puri Jagannath #Tom Boys #Puri Musings

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు