మహేష్ బాబు సినిమా కథ విజయ్ దేవరకొండతో! పూరీ బారీ స్కెచ్  

Puri Jagannath Gets A Script Ready For Vijay Devarakonda-

తెలుగు ఇండస్ట్రీలో పూరీ జగన్నాథ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది.నిజమైన హీరోలని టాలీవుడ్ కి పరిచయం చేసిన ఘనత పూరీకి దక్కుతుంది.

Puri Jagannath Gets A Script Ready For Vijay Devarakonda-

కమర్షియల్ ఎలిమెంట్స్ ని పక్కాగా ఓడిసిపట్టుకునే పూరీ జగన్నాథ్ యూత్ కి ఏం కావాలో అలాంటి సినిమాలని, తనదైన కథనం జోడించి అందిస్తూ ఉంటాడు.అందుకే టాలీవుడ్ లో పూరీకి ఒక బ్రాండ్ క్రియేట్ అయ్యింది.

అయితే ఈ మధ్య కాలంలో పూరీ జగన్నాథ్ సినిమా అన్ని వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి.ఎంత సేపు ఒకటే మూస స్టొరీ ఫార్మాట్ లో వెళ్ళడం వలన అతను ఫెయిల్ అవుతూ వచ్చాడు.

Puri Jagannath Gets A Script Ready For Vijay Devarakonda-

ఇదిలా ఉంటే తాజాగా రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ పర్వాలేదనే టాక్ తెచ్చుకున్న కూడా లాంగ్ రన్ లో సినిమా రేంజ్ ఏంటి అనేది తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే మహేష్ బాబుతో తన డ్రీం ప్రాజెక్ట్ జనగణమన సినిమా చేస్తానని పూరీ జగన్నాథ్ ఎప్పుడో చెప్పాడు.

తాను తీసిన సినిమాలన్నింటిలో ఇదే బెస్ట్ అని చెప్పాడు.అయితే ప్రస్తుత పరిస్థితిలో పూరీతో సినిమా చేసేంత టైం మహేష్ బాబుకి లేదు.

అతను వరుసగా నలుగురు దర్శకులకి కాల్ షీట్స్ ఇచ్చేసాడు.ఈ నేపధ్యంలో జనగణమన సినిమా కోసం నెక్స్ట్ ఆప్షన్ గా పూరీ జగన్నాథ్ కుర్ర హీరో, వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండతో చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే పూరీ స్టొరీ లైన్ ని విజయ్ దేవరకొండకి వినిపించగా అతను కూడా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.మొత్తానికి పూరీ మహేష్ తో వర్క్ అవుట్ అవడం లేదని ఇప్పుడు తన డ్రీం ప్రాజెక్ట్ ని విజయ్ తో చేయడానికి ఫిక్స్ అయ్యాడని టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది.

.

తాజా వార్తలు

Puri Jagannath Gets A Script Ready For Vijay Devarakonda- Related....