'బుష్​క్రాఫ్ట్​' పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పూరీ..!

కరోనా వైరస్ పుణ్యమా అంటూ ప్రజలకు కొత్తగా పరిచయమైన లాక్ డౌన్ సమయంలో టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనదైన శైలిలో ఒక అంశాన్ని తీసుకుని పూర్తిగా అవగాహన కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే.సోషల్ మీడియా వేదికగా చేసుకొని ‘పూరి మ్యూజింగ్స్‘ అనే పేరుతో విభిన్న అంశాలను ప్రేక్షకులతో పంచుకుంటున్నాడు.

 Puri Jagannath Full Clarity On Bush Craft-TeluguStop.com

ఇందులో భాగంగానే తాజాగా ఆయన బుష్ క్రాఫ్ట్ గురించి ప్రజలకు తెలియజేశాడు.అసలు బుష్ క్రాఫ్ట్ అంటే ఏమిటో.

అది ఎలా ఉంటుందో.పూర్తిగా ఆయన మాటల్లో తెలుసుకుందాం.

 Puri Jagannath Full Clarity On Bush Craft-బుష్​క్రాఫ్ట్​’ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన పూరీ..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మనకున్న జీవన నైపుణ్యాలని తెలుసుకోవడం కోసం మనకి మనమే ఓ అగ్నిపరీక్ష పెట్టుకొని ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో ఒక్కడివే బతకడం చేసే పక్రియనే బుష్ క్రాఫ్ట్ అంటారని ఆయన చెప్పుకొచ్చాడు.

అయితే ఈ బుష్ క్రాఫ్ట్ చేయడం అంత సులువైన విషయం కాదని చెబుతూనే.

బుష్ క్రాఫ్ట్ అంటే అడవిలో జంతువులు లాగానే మనకు కూడా అవసరమైన తెలివితేటలు సంపాదించుకుని జీవించడమే అని తెలియజేశాడు.ఇది కూడా ఒక కళే నని.జంతువులకి అడవిలో ఎలా జీవించాలో తెలుసని కానీ మనం మాత్రం అలాంటి విషయాలు పూర్తిగా మర్చిపోయాము అని, మనం మనిషిగా పుట్టినందుకు కొన్ని బుష్ క్రాఫ్ట్ స్కిల్స్ తెలుసుకోవాలని తెలిపాడు.మనం అందుకు అవసరమైన ఆహారాన్ని ఎలా వేటాడాలి, ఎలా కొండలను అధిరోహించాలి, చేపలను ఎలా పట్టడం లాంటి కొన్ని విషయాలను ముందే తెలుసుకోవాలని చెప్పుకొచ్చాడు.

ఇకపోతే బుష్ క్రాఫ్ట్ అనేది మనకున్న జీవన నైపుణ్యాలని ఒక్కొక్కటిగా తెలుసుకోవడం కోసం మనం స్వతహాగా పెట్టుకుని ఒక పరీక్ష అని అందులో భాగంగానే ఒంటరిగా బయలుదేరి వెళ్లి అడవిలో జీవించడం అని చెప్పుకొచ్చాడు.

బుష్ క్రాఫ్ట్ లో భాగంగా ముందుగా అడవిలో మంచినీళ్లు ఎక్కడ దొరుకుతాయో వెతుక్కోవాలని.అలాగే ఆహారం ఆకలి వేసినప్పుడు ఎలా వేటాడి తినాలో తెలుసుకోవాలని.అక్కడే నివసించడానికి ఒక చిన్న గూడు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసుకొని అందులో నిద్రించాలని తెలిపాడు.

వీటితో పాటు మనపై ఏవైనా జంతువులైన దాడి చేస్తే వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి, సురక్షితంగా ఎలా బయటపడాలి అన్న విషయాలను ముందుగానే తెలుసుకొని వాటి నుంచి ఎలా బయటపడాలో చెప్పుకొచ్చాడు.వీటితో పాటు మరిన్ని విషయాలు బుష్ క్రాఫ్ట్ లో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలియజేశాడు.

#Puri Jagannadh #Viral Video #Life Skills #Social Media #DirectorPuri

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు