కాపీ కామెంట్స్ పై క్లారిటీ ఇచ్చిన పూరి  

Puri Jagannath Comments On Ismart Shanker-

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము దులుపోతోంది.మొదటివారంలోనే తెలుగు రాష్ట్రాల్లో 25 కోట్ల వరకు లాభాలు అందుకున్న ఈ సినిమా రామ్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది.అయితే ఇటీవల సినిమా కథ నాదే అంటూ ఆనందం హీరో ఆకాష్ మీడియా ముందు వివరించిన సంగతి తెలిసిందే.

Puri Jagannath Comments On Ismart Shanker--Puri Jagannath Comments On Ismart Shanker-

Puri Jagannath Comments On Ismart Shanker--Puri Jagannath Comments On Ismart Shanker-

ఇక ఈ విషయంపై దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయనని ఎప్పుడు కలవలేదని అన్నారు.అలాగే ఇలాంటి ఆరోపణలు రావడం కామన్ అని మ్యాటర్ ని క్లోజ్ చేశారు.ఇక మహేష్ పై ఇటీవల చేసిన కామెంట్స్ పై కూడా పూరి ఊహించని విదంగా స్పందించాడు.

ఇప్పుడు మహేష్ కి సంబంధించిన ఏ టాపిక్ కూడా వద్దని ట్రోలింగ్ నడుస్తుందని తెలుసు ఇప్పుడు మాట్లాడటం సరికాదని అన్నారు.ఇక నెక్స్ట్ మరిన్ని ప్రాంతాల ప్రజలను కలిసి ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ సెలబ్రేషన్స్ వారితో పంచుకుంటామని అన్నారు.

సీజన్స్ తో సంబంధం లేకుండా జనాలకు సినిమా నచ్చితే నెత్తినపెట్టుకుంటారని కూడా పూరి వివరణ ఇచ్చాడు.