పూరీ కూడా వెబ్ సిరీస్ కి ఓటేసాడు... బోల్డ్ కంటెంట్ తో ప్రయోగం

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్.ఇక ప్రతి ఒక్క హీరో పూరీ సినిమాలో చేస్తే తమ రేంజ్ మారిపోతుందని అనుకుంటూ ఉంటారు.

 Puri Jagannadh Plan Bold Content Web Series, Tollywood, Fighter Movie, Vijay Dev-TeluguStop.com

హీరోయిజంని అద్బుతంగా ఆవిష్కరించి పూరీ జగన్నాథ్ తన ప్రతి సినిమాలో కూడా హీరో చెడ్దోడుగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఉంటాడు.ఏదైనా చెప్పాలనుకున్న విషయాన్ని తన సినిమాలతో షూటింగ్ చెప్పడం పూరీ స్టైల్.

అందుకే టాలీవుడ్ లో దర్శకుడుగా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.ఇక పూరీ జగన్నాథ్ మరల ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చి ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ సినిమాని తెరక్కిస్తున్నాడు.

ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ఏకంగా ఐదు భాషలలో సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తయిపోయింది.

ఇదిలా ఉంటే ట్రెండ్ అద్భుతంగా ఆవిష్కరించే పూరీ జగన్నాథ్ ఇప్పుడు ట్రెండ్ సృష్టిస్తున్న వెబ్ సిరీస్ లకి ఓటేసాడు.

ఇప్పటికే చాలా మంది దర్శక, నిర్మాతలు వెబ్ సిరీస్ లు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

రాబోయే కాలం అంతా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ హవానే సాగుతుంది.సినిమాలు కూడా అన్ని డిజిటల్ ఒటీటీలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

అదే సమయంలో ఓటీటీ ద్వారా అద్భుతమైన కంటెంట్ లతో వెబ్ సిరీస్ లు వస్తూ ఉండటంతో సినీ ప్రేక్షకులు తమకి నచ్చే జోనర్ వెబ్ సిరీస్ లు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.ఈ నేపధ్యంలో పూరీ జగన్నాథ్ కూడా ఈ కరోనా వలన వచ్చిన ఖాళీ సమయంలో ఒక బోల్డ్ కంటెంట్ వెబ్ సిరీస్ కి కథ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది.

ఈ కథతో ప్రముఖ ఓటీటీ చానల్ వెబ్ సిరీస్ నిర్మించడానికి రెడీ అయ్యిందని సమాచారం.తెలుగు, హిందీ భాషలలో ఈ వెబ్ సిరీస్ ని పూరీ తెరకెక్కించాలని భావిస్తున్నట్లు బోగట్టా.

అయితే అది విజయ్ దేవరకొండ సినిమా పూర్తయిన తర్వాత చేస్తాడా లేదంటే ముందుగానే తెరకెక్కిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube